Sanjay Raut ED : తెర వెనుక తతంగం నడిపిన రౌత్ – ఈడీ
అతడికి బెయిల్ ఇవ్వవద్దని కేంద్ర ఏజెన్సీ
Sanjay Raut ED : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut ED) ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వవద్దంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) స్పష్టం చేసింది.
ఆయన మొత్తం తెర వెనుక ఉంటూ తతంగం నడిపించారంటూ ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా సంజయ్ రౌత్ శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడగా పేరొందారు.
పత్రా చాల్ కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించింది ఈడీ. ఆయన బెయిల్ దరఖాస్తును ఈడీ వ్యతిరేకించింది.
ఇదిలా ఉండగా రౌత్ ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగ ఈడీ తన సమాధానాన్ని దాఖలు చేసింది. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సంజయ్ రౌత్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అందుకు ఈడీ(Sanjay Raut ED) వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీపై సెప్టెంబర్ 15న సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు ఈడీ తన సమాధానంలో స్పష్టం చేసింది.
సంజయ్ రౌత్ పై మొదటి విచారణ ఏప్రిల్ 1, 2022న నమోదు చేసినట్లు తెలిపింది. ఎంపీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పలు ఆరోపణలు చేసింది.
కాగా తనపై రాజకీయ ప్రతీకారంతో కేసులో ఇరికించారని ఆరోపణలు చేసిన సంజయ్ రౌత్ మాటల్లో వాస్తవం లేదని కుండ బద్దలు కొట్టింది ఈడీ.
Also Read : ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి జైలు శిక్ష