MLC Kavitha ED : ఈడీ నోటీస్ కవిత సీరియస్
వెనక్కి తగ్గను భయపడను
MLC Kavitha ED Notice : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇప్పటికే సీబీఐ ఆమెను విచారించింది హైదరాబాద్. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం కవితకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ED Notice) సీరియస్ గా స్పందించారు. తనకు ఈడీ నోటీసులు ఇచ్చింది వాస్తవమేనని స్పష్టం చేశారు.
వీటిపై ఎలా స్పందించాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా మార్చి 9న ఢిల్లీకి రావాల్సిందిగా స్పష్టం చేసింది ఈడీ. ఇవాళ మహిళా దినోత్సవం. తాను బిజీగా ఉన్నానని, ఒకవేళ రాలేనని చెప్పాలా లేక వస్తానని అనాలా అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
తనకు ముందస్తు అపాయింట్మెంట్స్ ఉన్నాయని దీనిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టేందుకు ప్లాన్ చేశారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha). ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే పానకంలో పుడకలా కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది.
అయితే తనకు చట్టంపై గౌరవం ఉందని, తాను కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పారు కల్వకుంట్ల కవిత. అయితే ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీగా అక్రమ పద్దతుల్లో ఎన్నికైందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కూతురు కవితకు సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ నీ వెనుక ఉందంటూ ముందుకే వెళ్లాలని స్పష్టం చేసినట్లు టాక్ .
Also Read : ‘స్వగృహ’కు ఆమె ఆలంబన