Rahul Gandhi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ విచారించింది.
దాదాపు 11 గంటలకు పైగా రాహుల్ గాంధీని(Rahul Gandhi) విచారించారు ఈడీ ఆఫీసర్లు. అంతకు ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా దేశ వ్యాప్తంగా సత్యా గ్రహ్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని అన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసుల ముందు ఆందోళనలు చేపట్టారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా పోలీసుల మయం అయ్యింది. ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఖాకీలను మోహరించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఇక ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు రాహుల్ గాంధీ కాలినడకన ర్యాలీగా బయలు దేరారు. ఆయనకు సంఘీభావంగా సీనియర్లు కూడా వెంట నడిచారు.
చెల్లెలు ప్రియాంక గాంధీ సైతం రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెంట ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ రాహుల్ స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.
ఉదయం 11 గంటల సమయంలో లోపలకు వెళ్లారు. 3 గంటల పాటు విచారించారు. భోజనానికి వదిలారు. ఆ తర్వాత మరికొన్ని గంటల పాటు విచారించారు.
ఈ కేసును కొట్టి వేశారు. కానీ మళ్లీ నమోదు చేశారు. బీజేపీ మాజీ ఎంపీ , న్యాయవాది సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు చేశారు.
Also Read : నేతల కామెంట్స్ కోర్టు సీరియస్