ED Raids : గేమింగ్ యాప్ కేసులో ఈడీ దాడులు

కోల్ క‌తాలో కోట్ల‌ల్లో న‌గ‌దు స్వాధీనం

ED Raids :  మొబైల్ గేమింగ్ యాప్ కేసులో ఈడీ దాడులు చేపట్టింది కోల్ క‌తా న‌గ‌రంలో. కోట్ల రూపాయ‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకుంది. ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ ప‌శ్చిమ బెంగాల్ పై ప‌డ్డాయి.

మొబైల్ గేమింగ్ అప్లికేష‌న్ ఈ – న‌గ్గెట్స్ ను విడుద‌ల చేశారు. ఇందులో కీల‌క‌మైన వ్య‌క్తిగా అమీర్ ఖాన్ ను గుర్తించారు. ఈ మేర‌కు ఈడీ అత‌డిని అదుపులోకి తీసుకుంది.

ఈడీ సోదాల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 7 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. క‌ళ్లు చెదిరేలా నోట్ల క‌ట్ట‌లు జ‌మ చేసి ఉండ‌డం విస్తు పోయేలా చేసింది ఈడీ అధికారుల‌ను. మొబైల్ గేమింగ్ అప్లికేష‌న్స్ కు సంబంధించిన విచార‌ణ‌కు సంబంధించి కోల్ క‌తా లోని ఆరు ప్రాంగ‌ణాల‌పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాడి(ED Raids) చేసింది.

భారీ ఎత్తున న‌గ‌దును స్వాధీనం చేసుకుంది. మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం (పీఎంఎల్ఏ) 2 002 నిబంధ‌న‌ల ప్ర‌కారం సోదాలు కొన‌సాగుతున్నాయి.

పెద్ద ఎత్తున న‌గ‌దు లెక్కింపు కొన‌సాగాయి. ఫెడ‌ర‌ల్ బ్యాంక్ అధికారుల ఆధారంగా పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేష‌న్ లో దీనికి సంబంధించి ప్ర‌థ‌మ స‌మాచార నివేదిక (ఎఫ్ఐఆర్) న‌మోదు చేసిన‌ట్లు ఈడీ తెలిపింది.

ప్ర‌జ‌ల‌ను మోసం చేసే ల‌క్ష్యంతో అమీర్ ఖాన్ యాప్ ను రూపొందించిన‌ట్లు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ వెల్ల‌డించింది. డేటా, యాప్ స‌ర్వ‌ర్ ల నుండి తుడిచి వేయ‌బ‌డింది. మొబైల్ యాప్ పేరుతో వేలాది మందిని మోసం చేశారు.

Also Read : వేత‌న సంఘం సిఫార‌సుల‌కు సీఎం ఓకే

Leave A Reply

Your Email Id will not be published!