ED Raids: వైఎస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ! 9 కోట్ల నగదు, 23 కోట్లు విలువచేసే బంగారం, వజ్రాలు స్వాధీనం !

వైఎస్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ! 9 కోట్ల నగదు, 23 కోట్లు విలువచేసే బంగారం, వజ్రాలు స్వాధీనం !

ED Raids : ముంబయి టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వైఎస్‌ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయి వసాయి విరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ లో ముంబయి, హైదరాబాద్ నగరాలతో పాటు 13 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.

ED Raids on YS Reddy

ముంబయిలోని మిరా భయాందర్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు 2009 నుంచి అనుమతులు ఇచ్చారు. ఈ కేసులో సీతారాం గుప్తా, అరుణ్ గుప్తా కీలక నిందితులుగా ఉన్నారు. నిందితులు అధికారులతో కలిసి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా వీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వైఎస్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

Also Read : BSF Jawaan: బీఎస్ఎఫ్ జవాన్‌ పూర్ణం కుమార్‌ ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్‌

Leave A Reply

Your Email Id will not be published!