Nawab Malik : మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik)కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది.
ఇప్పటికే అదుపులో ఉన్న ఆయనకు సంబంధించిన లావాదేవీలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలపై కన్నేసింది. ఈ మేరకు నవాబ్ మాలిక్(Nawab Malik) కు చెందిన కుటుంబీకులు, బంధువులకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా కావాలని కోరింది.
ఇందులో భాగంగా ఇవాళ ఈడీ నవాబ్ మాలిక్ కు చెందిన ఆరు ఫ్లాట్ల రికార్డులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి మాలిక్ తనయుడు ఫరాజ్, మాలిక్, ఆయన భార్య మహే జబీన్ పేరుతో రిజిస్టర్ చేసిన రెండు ఫ్లాట్ల ఆస్తులు ఉన్నాయి.
ఆయా ఫ్లాట్లకు సంబంధించిన యాజమాన్య రికార్డులు, పత్రాలను కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కి లేఖ రాసింది. ఈ ఫ్లాట్లకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
కాగా దేశం విడిచి పారి పోయిన గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహాయకులపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి నవాబ్ మాలిక్ ను గత నెల 23న ఈడీ అరెస్ట్ చేసింది.
ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇడ్రహీంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లను సోదా చేసిన అనంతరం పక్కా ఆధారాలతో మంత్రి నవాబ్ మాలిక్ ను అదుపులోకి తీసుకుంది ఈడీ.
ఇదిలా ఉండగా తనను కావాలని ఇరికించారని, వెంటనే విడుదల చేయాలని కోరుతూ మాలిక్ మధ్యంతర బెయిల్ దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది.
Also Read : కన్నుల పండువగా అవార్డుల ప్రదానం