ED MLC Kavitha : పేరు పిళ్లైది దందా న‌డిపింది క‌వితే – ఈడీ

సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ కీల‌క భూమిక

ED MLC Kavitha : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ దిమ్మ తిరిగే వాస్త‌వాలు వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క పాత్ర పోషించింది సౌత్ గ్రూప్ అని. ఈ గ్రూప్ లో అత్య‌ధిక వాటా క‌లిగి ఉన్న‌ది ఎమ్మెల్సీ క‌వితేన‌ని(ED MLC Kavitha) స్ప‌ష్టం చేసింది. ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌మీర్ మ‌హేంద్రును విచారించిన సంద‌ర్భంగా మొత్తం 268 పేజీల‌తో కూడిన నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కీల‌క‌మైన భూమిక పోషించింది ఆమేన‌ని వెల్ల‌డించింది. త‌మిళ‌నాడుకు చెందిన రామ‌చంద్ర పిళ్లైని ముందుంటే వెనుక ఉండి క‌థ అంతా న‌డిపించిందని తెలిపింది ఈడీ. ఈ మొత్తం ఛార్జ్ షీట్ లో ప‌లుమార్లు క‌విత‌ను పేరును ప్ర‌స్తావించింది. ఈ లిక్క‌ర్ స్కాంలో ఎమ్మెల్సీ క‌విత భ‌ర్త అనిల్ కు కూడా పాత్ర ఉంద‌ని పేర్కొంది.

ఈ మొత్తం మ‌ద్యం దందాలో పొలిటిక‌ల్ గా ప్ర‌భావం ఉంద‌ని తెలిపింది. ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి, అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డి సౌత్ గ్రూప్ గా ఏర్ప‌డి ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని వెల్ల‌డించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్.

శ‌ర‌త్ భార్య క‌నికా రెడ్డికి చెందిన చార్ట‌ర్ ఫ్లైట్ లో ప్ర‌యాణం చేశార‌ని, దందా న‌డిపార‌ని, డ‌బ్బులు చేతులు మారాయ‌ని పేర్కొంది. ఎల్ 1 లైసెన్సుల్లో 65 శాతం సౌత్ గ్రూప్ కు వాటా ఉంటే అత్య‌ధిక వాటా 35 శాతం ఎమ్మెల్సీ క‌విత‌కు ఉంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది ఈడీ.

Also Read : లిక్క‌ర్ స్కాంలో క‌విత‌కు 32 శాతం వాటా

Leave A Reply

Your Email Id will not be published!