ED Summons : బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈడీ సమన్లు
దూకుడు పెంచిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
ED Summons : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇవాళ మరో దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీకి ఝలక్ ఇచ్చింది.
ఆ పార్టీకి చెందిన ప్రముఖ సీనియర్ నాయకుడు పశువుల స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుబ్రతా మోండల్ ను అరెస్ట్ చేసింది.
ఇది ఇలా ఉండగానే ఈడీ రంగంలోకి దిగింది. ఈ మేరకు బొగ్గు స్మగ్లింగ్ కేసులో 8 మంది పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఈడీ సమన్లు(ED Summons) జారీ చేసింది.
ఇక కేంద్ర ఏజెన్సీ సమన్లు జారీ చేసిన ఐపీఎల్ అధికారుల్లో జ్ఞనావంత్ సింగ్ (ఏడీజీ, సీఐడీ) , కోటేశ్వర్ రావు , ఎస్ . సెల్వ మురుగన్ , శ్యామ్ సింగ్ , రాజీవ్ మిశ్రా, సుకేశ్ కుమార్ జైన్ , తథాగత బసు ఉన్నారని ఈడీ వెల్లడించింది.
న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో వీరు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. నిర్దిష్టమైన తేదీలు కూడా ఖరారు చేసింది. వీరిని పూర్తిగా బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.
విచారణ నిమిత్తం హాజరు కావాలని కోరామని పేర్కొంది. బొగ్గు స్కాంలో ఈ ఐపీఎస్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించారంటూ సంచలన ఆరోపణలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
వీరంతా ఈ భారీ కుంభకోణంలో లబ్ది పొందినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది ఈడీ.
వీరిందరినీ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా జరిగిన ప్రాంతాలలో ప్రత్యేకంగా ఏరికోరి వీరిని నియించడం జరిగిందని తమ విచారణలో తేలిందని కుంబ బద్దలు కొట్టింది.
దీంతో నిన్న మంత్రి నేడు సీనియర్ నాయకుడు ఇవాళ ఐపీఎస్ లను టార్గెట్ చేసింది ఈడీ.
Also Read : ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి