Manish Sisodia ED : సిసోడియాను ప్రశ్నించనున్న ఈడీ
జైల్లోనే మాజీ డిప్యూటీ సీఎం విచారణ
Manish Sisodia ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలుకు తరలించిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(Manish Sisodia ED) మంగళవారం ప్రశ్నించనుంది. మద్యం పాలసీని మార్చడంలో, రూ. 100 కోట్లు ఆప్ కు లబ్ది చేకూర్చడంలో కీలక పాత్ర పోషించారని కేసు నమోదు చేసింది సీబీఐ. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 34 మందిపై అభియోగాలు మోపింది. వీరిలో 10 మందిని సిసోడియాతో కలిపి అరెస్ట్ చేసింది.
గత ఫిబ్రవరి 26న సీబీఐ మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. సీబీఐ కోర్టులో హాజరు పర్చింది. మార్చి 20 వరకు కస్టడీ ఇచ్చేందుకు ఒప్పుకున్నా..వెంటనే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించారు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి. ఆర్థిక నేరాలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసింది. రెండు వారాల పాటు సిసోడియాను(Manish Sisodia ED) తీహార్ జైలుకు పంపడంతో అక్కడనే ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసేందుకు రెడీ అయ్యింది ఈడీ.
అరెస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఢిల్లీ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఇదిలా ఉండగా నిందితుడిని అరెస్ట్ చేసే ముందు వాంగ్మూలాన్ని సేకరించడం తప్పనిసరి. అందుకే ఈడీ రంగంలోకి దిగింది.
మొత్తంగా ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిసోడియా అరెస్ట్ తర్వాత తదుపరి ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read : ఆర్ఎస్ఎస్ మతోన్మాద తీవ్రవాద సంస్థ