Eknath Shinde : శివ‌సేన‌ను వ‌ణికిస్తున్న ఒక‌ప్ప‌టి ‘ఆటోడ్రైవ‌ర్’

ఏక్ నాథ్ షిండే రాజ‌కీయ ప్ర‌జా ప్ర‌స్థానం

Eknath Shinde : దేశ వ్యాప్తంగా గ‌త కొన్ని రోజుల నుంచి ఒకే పేరు మారుమ్రోగుతోంది. అత‌డు ఎవ‌రో కాదు మ‌రాఠాలో బ‌లీయ‌మైన చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన బాలా సాహెబ్ ఠాక్రే త‌యారు చేసిన శివసేనలో సామాన్య కార్య‌కర్త నుంచి మంత్రి దాకా ఎదిగిన ఏక్ నాథ్ షిండే.

త‌న‌కు అవమానం జ‌రిగిందంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ధిక్కార స్వ‌రం వినిపించారు. ఒకవేళ కాలం క‌లిసి వ‌స్తే ఆయ‌నే మ‌రాఠాలో ప్ర‌భుత్వాన్ని

ఏర్పాటు చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు.

ఎందుకంటే ఏక్ నాథ్ షిండే వెనుక బ‌లీయ‌మైన శ‌క్తులు ఉన్నాయి. అంత‌కంటే ఎక్కువ‌గా కేంద్రం స‌పోర్ట్ ఉన్న‌ద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త క‌లిగిన, సుదీర్గ‌మైన కాలపు చ‌రిత్ర క‌లిగిన శివ‌సేన ఇప్పుడు ఉలిక్కి ప‌డుతోంది.

త‌న‌ను తాను నిల‌దొక్కు కోవ‌డానికి నానా తంటాలు ప‌డుతోంది. ముంబైకి ఆనుకుని ఉన్న థానే లో ఏక్ నాథ్ షిండే ఏది చెబితే అదే వేదం.

అంత‌కంటే అదే శాస‌నం.

మ‌రి ఇంత బ‌ల‌మైన వ్య‌క్తిగా, నాయ‌కుడిగా ఎద‌గ‌డానికి కార‌ణం ఎవ‌రు అంటే. త‌నేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దివంగ‌త మ‌రాఠా యోధుడు, పులిగా

భావించే బాలా సాహెబ్ ఠాక్రే కు తాను ప్రియ శిష్యుడిన‌ని ఇప్ప‌టికీ చెప్పుకుంటారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).

పోనీ షిండేది బ‌ల‌మైన వ‌ర్గాల కుటుంబ నేప‌థ్యం కాదు. కానీ ఒక‌ప్పుడు బ‌తుకు దెరువు కోసం ఆటో రిక్షా న‌డిపిన వాడు. ఆ త‌ర్వాత శివ‌సేన భ‌క్తుడిగా, సైనికుడిగా, రాష్ట్రాన్ని శాసించే నాయ‌కుడిగా ఎదిగాడు ఏక్ నాథ్ షిండే.

ప్ర‌స్తుతం ఎన్ని స‌వాళ్లు విసిరినా , ఇంకెంత‌గా భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసినా అద‌ర‌డం లేదు. బెద‌ర‌డం లేదు. స‌వాళ్ల‌కు సై అంటున్నారు.

యుద్దానికి సిద్దమేన‌ని ప్ర‌క‌టిస్తున్నారు.

మొత్తంగా ఏక్ నాత్ షిండే ధిక్కార స్వ‌ర‌మే కాదు తాను దేనినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాన‌ని తెలిపాడు. ఓ వైపు దేశ‌మంతా షిండే పేరు

జ‌పిస్తుంటే ఆయ‌న మాత్రం గౌహ‌తి లోని రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో తాపీగా చ‌ద‌రంగం (చెస్ ) ఆడుతూ కూర్చున్నారు.

అవును..రాజ‌కీయం అంటే చ‌ద‌రంగ‌మే క‌దా. అందుకే ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయాడు షిండే.

Also Read : ద‌మ్ముంటే శివ‌సేన వ‌దిలి పోరాడండి

Leave A Reply

Your Email Id will not be published!