Eknath Shinde : ఎవరీ ఏక్ నాథ్ షిండే ఏమిటా కథ
మహారాష్ట్ర సర్కార్ లో కీలక నేత
Eknath Shinde : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు శివసేన పార్టీకి చెందిన ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు షిండే.
మరాఠాలోని థానేలో అత్యంత బలమైన నాయకుడిగా ఉన్నారు. శివసేన పార్టీకి పెద్ద దిక్కుగా, అండగా ఉంటూ వచ్చారు. మంత్రిగా ఉన్నప్పటికీ తనపై సీఎం ఉద్దవ్ ఠాక్రే, తనయుడు ఆధిపత్యం ఎక్కువగా ఉందంటూ ఆగ్రహంతో ఊగి పోతున్నారు.
ఆపై డిప్యూటీ సీఎంగా ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్ నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ మండిపడుతున్నారు.
ఇదే సమయంలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగా మహారాష్ట్రలో. ఈ రెండింట్లోనూ శివసేన అధికార కూటమికి కోలుకోలేని షాక్ తగిలింది. రాజ్యసభకు సంబంధించి ఆరు సీట్లకు గాను బీజేపీ 3, మహా వికాస్ అఘాడీకి మూడు సీట్లు దక్కాయి.
ఇక తాజాగా జరిగిన శాసన మండలి సభ ఎన్నికల్లో 10 సీట్లకు గాను 5 సీట్లు ఎంవీఏ అభ్యర్థులు విజయం సాధిస్తే మిగతా 5 సీట్లను ఊహంచని
రీతిలో చేజిక్కించుకుంది భారతీయ జనతా పార్టీ.
దీంతో షాక్ నుంచి కోలుకునే లోపే శివసేన కూటమికి కోలుకోలేని రీతిలో షాక్ తగిలింది. ఏక్ నాథ్ షిండే తో పాటు మరో 27 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ లో ఓ హోటల్ లో మకాం వేయడం కలకలం రేపింది.
ఈ ఊహించని షాక్ తో మేలుకున్ని శివసేన పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే అత్యవసర సమావేశానికి పీలుపు ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు
హాజరు కావాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా ముంబైకి పక్కనే ఉంది థానే. అంతే కాకుండా శివసేన పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).
కాగా ఏక్ నాథ్ షిండే వరుసగా మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014, 2019లో విజయం సాధించారు.
2014లో గెలుపొందాక శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్ సభ ఎంపీగా ఉన్నారు. సోదరుడు
ప్రకాశ్ షిండే కౌన్సిలర్ గా ఉన్నారు.
గత కొంత కాలంగా పార్టీ తనను పక్కన పెట్టడంపై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Also Read : బీజేపీ నేతలపై వరుణ్ గాంధీ ఫైర్