Eknath Shinde : శివసేన పార్టీ కోసం షిండే కొత్త భవనం
అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్న మంత్రి
Eknath Shinde : మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల దోసి భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేసి మరాఠా పీఠంపై కొలువు తీరిన రెబల్ మాస్ లీడర్ ఏక్ నాథ్ షిండే మరింత దూకుడు పెంచారు.
ఇప్పటికే అసలైన శివసేన పార్టీ తమదేనంటూ ప్రకటించారు షిండే. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు బాలా సాహెబ్ ఠాక్రే తనయుడు ఉద్దవ్ ఠాక్రే. ఓ వైపు షిండే మరో వైపు ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై విచారించిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తీసుకునే నిర్ణయాన్ని వాయిదా వేయాలని స్పష్టం చేసింది తదుపరి తీర్పు వెలువరించేంత వరకు.
ఇదిలా ఉండగా సీఎం షిండే(Eknath Shinde) శివసేన పార్టీ కోసం కొత్త భవనం ఉండాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా షిండే శిబిరం మహారాష్ట్రలోని దాదార్ లో ప్రస్తుత శివసేన భవన్ కు సమీపంలో స్థలం కోసం వెతుకుతున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కువ మంది ఏక్ నాథ్ షిండే వైపు ఉన్నారు. దీంతో ఆయనను తమదే అసలైన పార్టీగా గుర్తించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
దీనిపై ఆగస్టు 8 వరకు డెడ్ లైన్ విధించింది సీఈసీ. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్దవ్ ఠాక్రే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతానికి వాయిదా వేయాలంటూ ఆదేశించింది.
తాజాగా ఆగస్టు 23 లోగా పూర్తి ఆధారాలు ఏక్ నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రే తమకు అందజేయాలని నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా సీఎం గా కొలువు తీరడంతో ప్రస్తుతం తమ పార్టీకి సంబంధించి భవన్ ఉండాలని అనుకుంటున్నారట షిండే.
Also Read : జాతీయ జెండాతో ఆర్ఎస్ఎస్