Eknath Shinde : నా వెనుక 46 మంది ఎమ్మెల్యేలు – షిండే
సంచలన ప్రకటన చేసిన మంత్రి
Eknath Shinde : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గుజరాత్ సూరత్ లో ఉన్న రాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంలోని గౌహతికి చేరుకున్నారు.
ఈ తరుణంలో మరాఠాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి దాకా షిండే వెనుక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని భావించారు. కానీ తన వెనుక ఏకంగా 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ బాంబు పేల్చారు.
తాను శివసేన నుంచి వైదొలగడం లేదన్నారు. బాలా సాహెబ్ ఠాక్రే సిద్దాంతాన్ని ముందుకు తీసుకు వెళతానని ఏక్ నాథ్ షిండే చెప్పారు. తనకు 46 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు.
బుధవారం ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడారు. పార్టీ మారే ఆలోచన తనకు ఎంత మాత్రం లేదన్నారు. తాను శివసేన నుంచి వెళ్లి పోతున్నానంటూ కొందరు చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని తేల్చేశారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేల సపోర్ట్ తనకు ఉందని ప్రకటించారు. బాలా సాహెబ్ ఠాక్రే సిద్దాంతాలను తాను ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని వెల్లడించారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).
తాము మొదటి నుంచి హిందూత్వాన్ని విశ్వసిస్తామని, ఠాక్రేకు తాను ప్రియ శిష్యుడినని మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలను గౌహతి ఎయిర్ పోర్ట్ లో బీజేపీ నేతలు పల్లబ్ లోచన్ దాస్ , సుశాంత్ బోర్గో హైన్ షిండేలు స్వాగతించారు.
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కోసం సిద్దం చేసిన ఫైవ్ స్టార్ హోటల్ లో కనిపించడం విశేషం. ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ ఉందన్నది వాస్తవం.
Also Read : మహారాష్ట్ర లో ఎవరి బలం ఎంత