Election Commission: 474 రాజకీయ​ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఈసీ

474 రాజకీయ​ పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఈసీ

Election Commission : దేశవ్యాప్తంగా 474 రిజిస్టర్ పొలిటికల్ పార్టీల గుర్తింపును రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా ఆరేళ్ల పాటు పోటీ చేయకపోవడంతో రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ప్రక్షాళనలో భాగంగా గుర్తింపులేని పార్టీలపై ఈసీఐ దృష్టి పెట్టింది. మొదటి విడతగా ఆగస్టు 9న 334 రిజిస్టర్ అయిన గుర్తింపులేని రాజకీయ పార్టీలను (RUPPs) జాబితా నుంచి ఈసీ తొలగించింది. తాజాగా 474 పార్టీల గుర్తింపు రద్దు చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 808 రిజిస్టర్ పార్టీల గుర్తింపును ఈసీఐ రద్దు చేసింది. మరో 359 పార్టీల గుర్తింపు రద్దు చేసే ప్రక్రియలో ఈసీఐ (Election Commission) ఉన్నట్లు సమాచారం.

Election Commission Shocking

తాజాగా ఏపీలో 17, తెలంగాణలో 9 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఇప్పటివరకు 2520 గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఈ సంఖ్య 2046కు తగ్గిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని పేర్కొంది.

‘సెప్టెంబర్ 18న రెండో విడతలో భాగంగా 474 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తొలగించాం. గత ఆరేళ్లుగా ఈ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. ఈ కారణంగా గత 2 నెలల్లో 808 ఆర్‌యూపీపీలను జాబితా నుంచి తొలగించాం’ అని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇటీవల వరకూ 2,520 ఆర్‌యూపీపీలు ఉండగా, డీలిస్టింగ్ ప్రక్రియ తర్వాత అవి 2,046కు చేరుకున్నాయి. ప్రస్తుతం 6 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు,67 రాష్ట్ర పార్టీలు ఉన్నాయని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read : Shubhanshu Shukla: ఐఎస్‌ఎస్‌ అనుభవాన్ని వెల్లడించిన శుభాంశు శుక్లా

Leave A Reply

Your Email Id will not be published!