MCD Mayor Polls : సీఎం విన్న‌పం ఎల్జీ ఆమోదం

16న ఢిల్లీ బ‌ల్దియా మేయ‌ర్ ఎన్నిక

MCD Mayor Polls : ఢిల్లీలో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వ‌ర్సెస్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా మ‌ధ్య ఆధిప‌త్య పోరు ముదిరింది. ఇప్ప‌టికే ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌ల‌క‌లం రేపుతోంది. తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది ఈడీ. ఇదే స‌మ‌యంలో ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు కూడా చేర్చింది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ మ‌ద్యం కుంభకోణం కేసు అర‌వింద్ కేజ్రీవాల్ కు త‌ల‌నొప్పిగా మారింది.

ఈ త‌రుణంలో డిస్కంల‌లో నియ‌మించిన ఆప్ ప్ర‌తినిధుల‌ను కూడా ఎల్జీ తొల‌గించారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు ముగిసినా ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు వాయిదా ప‌డింది. బీజేపీ, ఆప్ స‌భ్యుల‌కు మ‌ధ్య గొడ‌వ‌ల‌తో వాయిదా వేస్తూ వ‌చ్చారు. తాజాగా సీఎం కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకు వేశారు. ఎలాగైనా స‌రే మేయ‌ర్ , డిప్యూటీ మ‌యేర్ ఇత‌ర ప‌ద‌వుల‌కు ఎన్నిక నిర్వ‌హించాల‌ని కోరుతూ ఎల్జీ స‌క్సేనాకు లేఖ రాశారు.

ఈ మేర‌కు స్పందించిన ఎల్జీ ఈనెల 16న ఢిల్లీ బ‌ల్దియా మేయ‌ర్ ఎన్నిక‌కు (MCD Mayor Polls) ముహూర్తం ఖరారు చేశారు. ఇదే విష‌యాన్ని ఎల్జీ కార్యాల‌యం వెల్ల‌డించింది. నూత‌న మేయ‌ర్ తో పాటు డిప్యూటీ మేయ‌ర్ ను, ఆరుగురు స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల‌ను ఎన్నుకోనున్నారు. 16న ఉద‌యం 11 గంట‌ల‌కు డాక్ట‌ర్ ఎస్పీ ముఖ‌ర్జీ సివిక్ సెంట‌ర్ లోని ఎ బ్లాక్ , 4వ అంత‌స్తులో ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశం అవుతుంద‌ని పేర్కొన్నారు. సీఎం చేసిన సిఫార‌సు మేర‌కు తాను ఆమోదం తెలిపిన‌ట్లు ఎల్జీ వెల్ల‌డించారు.

Also Read : అస్సాం గ‌వ‌ర్న‌ర్ గా క‌టారియా

Leave A Reply

Your Email Id will not be published!