Elon Musk Changes : ట్విట్టర్ లో లైక్ బటన్ మార్చిన మస్క్
రోజుకో ట్విస్ట్ ఇస్తున్న సిఇఓ
Elon Musk Changes : సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతూ వస్తున్న ట్విట్టర్ రోజు రోజుకు మార్పులకు లోనవుతోంది. ఎప్పుడైతే టెస్లా చైర్మన్ , ట్విట్టర్ సీఇఓగా ఎలోన్ మస్క్(Elon Musk) కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా ప్రతి రోజూ ఏదో ఒక వార్తతో ముందుకు వస్తున్నాడు. చిన్నప్పటి నుండి టెక్నికల్ గా పట్టు కలిగిన మస్క్ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.
Elon Musk Changes Twitter Like Button
ఇందులో భాగంగా ఇటీవలే ట్విట్టర్ లోగోను మార్చేశాడు. పిట్ట స్థానంలో ఎక్స్ అనే దానిని చేర్చాడు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. లైక్ చేసే బటన్ ను కూడా మార్చేశాడు. ప్రత్యేకించి ఐ ఫోన్ లవర్స్ కోసం దీనిని మార్చుతున్నట్లు ట్విట్టర్ వేదికగా మంగళవారం ప్రకటించాడు సిఇఓ ఎలోన్ మస్క్.
మైక్రో బ్లాగింగ్ సంస్థకు పోటీగా ఫేస్ బుక్ థ్రెడ్స్ తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. కారణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ట్విట్టర్ ను వాడకుండా ఉండలేక పోతున్నారు. వీరు ప్రతిరోజూ గంటల కొద్దీ ట్విట్టర్ లోనే గడుపుతున్నారని అంచనా.
మరోవైపు టిక్ మార్క్ కలిగి ఉండాలంటే యూజర్లు తప్పనిసరిగా ఏడాదికి కొంత ఫీజు చెల్లించాలని హుకూం జారీ చేశాడు మనోడు. ఇంకేం కొందరు చెల్లిస్తున్నారు. మరికొందరు విరమించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ట్విట్టర్ లో ఇంకెన్ని మార్పులు తీసుకు వస్తాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Also Read : Ram Gopal Varma : బాబు అరెస్ట్ ఆర్జీవీ లాజిక్