Elon Musk: 14వ బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్
14వ బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్
Elon Musk : ప్రపంచ కుబేరుడు, డోజ్ సారథి ఎలాన్ మస్క్(Elon Musk)… తన 14వ బిడ్డకు జన్మనిచ్చారు. తన నాల్గవ భార్య అయిన న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు తమ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టినట్లు తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పష్టం చేసారు. దీనితో ఎలాన్ మస్క్ తో పాటు, షివోన్ జిలిస్ కు తమ స్నేహితులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, ఉద్యోగులు, మరియు నెటిజన్ల నుండి శుభాకాంక్షలు వెళ్ళువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఎలాన్‌తో మాట్లాడాను. మా కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ గురించి ప్రపంచానికి స్వయంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నాం’ అని షివోన్ జిలిస్ తన ఎక్స్ లో రాసుకొచ్చారు. తమ మూడో బిడ్డ ఆర్కాడియా పుట్టినరోజు సందర్భంగా ఈవిషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నేపధ్యంలో షివోన్ పెట్టిన పోస్టుకు… హార్ట్ సింబల్‌తో మస్క్ రిప్లై ఇచ్చారు.
Elon Musk Gave Birth..
ఇక మస్క్ వైవాహిక జీవితం, సంతానం విషయానికి వస్తే… ఇప్పటివరకు మస్క్(Elon Musk) కు 12 మంది సంతానం. మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ వివాహమాడారు. అయితే వారికి సంతానం లేదు. అనంతరం కెనడియన్ గాయని గ్రిమ్స్‌తో సహాజీవనం చేసారు. దీనితో వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. మస్క్ ప్రస్తుతం తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న జిలిస్ తో సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉండగా… తాజాగా ఈ జంట నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది.
ఇదిలాఉండగా… ఇటీవల తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ రచయిత్రి ఆష్టీ సెయింట్ క్లెయిర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితమే తానో బిడ్డకు జన్మనిచ్చానని అయితే గోప్యత, భద్రతా కారణాల వల్ల ఈ విషయం బహిర్గతం చేయలేదని ఆమె తెలిపారు. దీనిపై ఇప్పటివరకు మస్క్ ఎలాంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు. ఒకవేళ ఈ బిడ్డకు కూడా మస్క్ తండ్రి అని తేలితే… ఇప్పటివరకు ఆయనకు 14 మంది సంతానం ఉన్నట్లు అవుతుంది. లేనిపక్షంలో షివోన్ జలిస్ కు పుట్టిన నాలుగో బిడ్డ 13వ సంతానం అవుతుంది… 12 మంది పిల్లలు మాత్రం సజీవంగా ఉన్నట్లు అవుతుంది.
Also Read : Reserve Bank of India Shocking : 2,000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ఆదేశాలు