Elon Musk : ట్విట్టర్ యూజర్లకు ఎలాన్ మస్క్ ఖుష్ కబర్
తమకు కావాల్సిన యాప్ వాడుకోవచ్చు
Elon Musk : ట్విట్టర్ ను కొనుగోలు చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆసక్తికర ట్వీట్లతో హల్ చల్ చేస్తున్నారు. రూ. 4,400 కోట్ల భారీ ధరకు చేజిక్కించుకున్నాడు. ఈ తరుణంలో ఇప్పటికే టాప్ ఎగ్జిక్యూటివ్ లను తొలగించాడు. సిఇఓ పరాగ్ అగర్వాల్, సిఎఫ్ఓ సెగల్, లీగల్ హెడ్ విజయా గద్దె లపై వేటు వేశారు.
ఇదే క్రమంలో కీలక మార్పులకు తెర తీశాడు ఎలోన్ మస్క్. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. ప్రధానంగా ట్విట్టర్ ను వాడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ట్విట్టర్ యూజర్లు తమకు కావాల్సిన యాప్ వెర్షన్ ను ఎంచు కోవచ్చని సూచించారు.
అది తమ విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు తెలిపారు. మీకు కావాల్సిన ట్విట్టర్ వెర్షన్ ని ఎంచు కోగలడం బహుశా మంచిదేనని పేర్కొన్నాడు. అది రేటింగ్ కు మంచిగా ఉపయోగ పడుతుందని తెలిపారు. ఇప్పటికే ట్విట్టర్ కంటెంట్ మోడరేషన్ కోసం కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.
ట్విట్టర్ లో మస్క్ చేసిన ట్వీట్ కు ఎనలేని స్పందన లభించింది. ఇక నుంచి యూజర్లు తమ ట్వీట్లపై రేటింగ్ లను అందించడం ద్వారా భవిష్యత్తులో తమకు నచచిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను ఎంచు కోవచ్చని కంపెనీ కొత్త యజమాని మస్క్ సూచించాడు.
మీకు కావాల్సిన ట్విట్టర్ వెర్షన్ ని ఎంచు కోగలడం బహుషా మంచిదేనని , అది సినిమా మెచ్యూరిటీ రేటింగ్ లో ఉంటుందన్నారు.
Also Read : మస్క్ ట్విట్టర్ కైవసం ట్రంప్ సంతోషం