US Regulator Elon Musk : ఎలాన్ మస్క్ చట్టానికి అతీతుడు కాదు
యుఎస్ రెగ్యులేటర్ స్ట్రాంగ్ వార్నింగ్
US Regulator Elon Musk : ప్రపంచ కుబేరుల్లో జాబితాల్లో టాప్ లో కొనసాగుతూ వస్తున్న టెస్లా సిఇఓ, చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ కు కోలుకోలేని షాక్ తగిలింది.
ఇటీవలే $44 బిలియన్లతో భారీ ధరకు కొనుగోలు చేశాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. తాను ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న వెంటనే కీలక , సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విస్తు పోయేలా చేస్తున్నాడు ఎలాన్ మస్క్.
వచ్చీ రావడంతోనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ , సీఎఫ్ఓ సెగెల్, లీగల్ హెడ్ విజయా గద్దె తో పాటు కీలకమైన పోస్టులలో కొనసాగుతున్న వారిని సాగనంపాడు. ఆపై 7,500 మంది ఉద్యోగులలో 3,978 మందిని తొలగిస్తున్నట్లు ఇమెయిల్ ద్వారా షాకింగ్ న్యూస్ చెప్పాడు.
ఈ తరుణంలో తాజాగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ట్విట్టర్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. చివరకు సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతున్న సంస్థలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఈ తరుణంలో కీలక ఎగ్జిక్యూటివ్ లు వైదొలగడంతో యుఎస్ రెగ్యులేటర్ సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు ఎలాన్ మస్క్(US Regulator Elon Musk) కు హెచ్చరికలు జారీ చేసింది. దేశం కంటే చట్టం కంటే ఎవరూ ముఖ్యం కాదని స్పష్టం చేసింది. ఎవరైనా లేదా దేశ అధ్యక్షుడైనా చట్టం పరిధిలో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రస్తుతం యుఎస్ రెగ్యులేటర్ జారీ చేసిన హెచ్చరికపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించ లేదు.
Also Read : ట్విట్టర్ కు షాక్ సీనియర్లు గుడ్ బై