Elon Musk Polls : ఎలాన్ మ‌స్క్ పోల్ నెట్టింట్లో వైరల్

ట్విట్ట‌ర్ బాస్ గా ఉండాలా వ‌ద్దా

Elon Musk Polls : టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ఆయ‌న ప్ర‌తి రోజూ వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్నారు. ప్ర‌పంచంలోనే టాప్ కుబేరుల్లో ఒక‌డిగా ఉన్న ఎలాన్ మ‌స్క్ ఉన్న‌ట్టుండి ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాక త‌న ఆదాయాన్ని కొంత కోల్పోయారు.

టాప్ పొజిష‌న్ లో ఉన్న వారంద‌రినీ ఊడ బెరికాడు. ఆపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ బెంబేలెత్తించాడు. ఆపై 9 వేల మందికి పైగా ప‌ర్మినెంట్, కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను సాగ‌నంపాడు. కాస్ట్ క‌టింగ్ ముఖ్య‌మ‌ని అందుకే తాను తీసి వేస్తున్న‌ట్లు తెలిపాడు. మ‌రో వైపు బ్లూ టిక్ పై త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న చేస్తానంటూ తెలిపాడు.

ఈ త‌రుణంలో ఎలాన్ మ‌స్క్ తీసుకున్నాక ట్విట్ట‌ర్ ఉంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది. తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇందులో భాగంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏకంగా పోల్ (Elon Musk Polls) నిర్వ‌హించాడు. అదేమిటంటే తాను ట్విట్ట‌ర్ సంస్థ‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉండాలా వ‌ద్దా అని ఏకంగా పోల్ చేప‌ట్టాడు.

సిఇఓ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలా లేక వ‌ద్దా అని కోరాడు నెటిజ‌న్ల‌ను. ఎలాంటి రిజ‌ల్ట్ వ‌చ్చినా తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు ఎలాన్ మ‌స్క్. దీనికి సంబంధించి డెడ్ లైన్ కూడా విధించాడు ట్విట్ట‌ర్ బాస్. మ‌ధ్యాహ్నం వ‌రకు 57. 6 శాతం మ‌స్క్ ఉండ‌కూడ‌ద‌ని పేర్కొంటే 42.4 శాతం సిఇఓగా ఉండాల‌ని కోరారు.

అయితే సాయంత్రం దాకా ఈ పోల్ ఉంటుంది. మ‌రి ఉంటాడో ఉండ‌డో అనేది రాత్రి లోపు తేలుతుంది. అంతే కాదు ఇటీవ‌ల త‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన జ‌ర్న‌లిస్టుల ఖ‌తాలాను కూడా స‌స్పెండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : యువ‌త‌కు ఖుష్ క‌బ‌ర్ ఐటీ బేఫిక‌ర్ – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!