Elon Musk : సంతకంతో ట్విట్టర్ కు ఎలోన్ మస్క్ షాక్
దావా వేస్తమని ట్విట్టర్ సంస్థ ప్రకటన
Elon Musk : నిన్నటి దాకా ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ చావు కబురు చల్లగా చెప్పారు.
తాను కోరినవేవీ సంస్థ తనకు ఇవ్వలేక పోయిందంటూ ఆరోపిస్తూ తాను డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా డీల్ నుంచి అర్ధాంతరంగా తప్పు కోవడంతో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను వైదొలిగితే ట్విట్టర్ కు ఒక బిలియన్ డాలర్లను నష్ట పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదే విషయాన్ని ట్విట్టర్ సంస్థ బోర్డు ప్రకటించింది కూడా. దీనిపై ట్విట్టర్ వేదికగా ఎలోన్ మస్క్(Elon Musk) కేవలం తన సంతకంతో మాత్రమే షేర్ చేస్తూ ఘాటుగా జవాబు ఇచ్చాడు. ప్రస్తుతం మస్క్ చేసిన ఈ పోస్ట్ కలకలం రేపింది.
ట్విట్టర్ లో ఇప్పటి వరకు ఎంత మంది యూజర్లు ఉన్నారు. అందులో ఫేక్ (నకిలీ ) ఖాతాలు ఎన్ని ఉన్నాయో తనకు ఇవ్వాలని పదే పదే కోరుతూ వచ్చాడు ఎలోన్ మస్క్.
అయితే దానికి ఒప్పందానికి ఏం సంబంధం అంటూ ట్విట్టర్ నిలదీసింది. అయితే మస్క్ ఎంత సేపు ట్విట్టర్ ను బద్నాం చేసే ప్రయత్నం చేశాడే తప్పా దానిని స్వంతం చేసుకోవాలని అనుకోలేదు.
అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఆపై ఆయన ఒప్పందం చేసుకున్నాడని తెలియగానే ట్విట్టర్ షేర్ల ధరలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. విచిత్రం ఏమిటంటే పెరగలేదు.
తాజాగా ఎలోన్ మస్క్ తన సంతకం శైలిలో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ నాయకత్వంపై స్వైప్ చేశాడు.
Also Read : విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష