Elon Musk : ట్విట్ట‌ర్ సిఇఓ ప‌రాగ్ పై మ‌స్క్ ఫైర్

సోష‌ల్ మీడియాలో కామెంట్స్ హ‌ల్ చ‌ల్

Elon Musk : సోష‌ల్ మీడియా దిగ్గ‌జంగా పేరొందిన ట్విట్ట‌ర్ కొనుగోలుపై వెనక్కి త‌గ్గారు టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్. ఇప్ప‌టికే $44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ఒప్పందం మొద‌ట కుదుర్చుకున్నాడు.

ఆ త‌ర్వాత తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ అంశం తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఎలోన్ మ‌స్క్(Elon Musk) మొద‌టి నుంచీ ప్ర‌వాస భారతీయుడైన ట్విట్ట‌ర్ సిఇఓగా ఉన్న ప‌రాగ్ అగ‌ర్వాల్ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌తతో ఉన్నారు.

ఆపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ లో ఫేక్ ఖాతాల విష‌యంపై త‌న‌కు వివ‌రాలు ఇవ్వాలంటూ ప‌లుసార్లు కోరాడు ఎలోన్ మ‌స్క్. కానీ సిఇఓ ఇవ్వ‌లేదు. దీనిపై వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు.

కానీ ఎలోన్ ఒప్పుకోలేదు. చివ‌ర‌కు ట్విట్ట‌ర్ ను బ‌ద్నాం చేసే ప‌నిలో ప‌డ్డారు. దీనిపై సీరీయ‌స్ గా స్పందించాడు మైక్రో బ్లాగ్ సంస్థ చైర్మ‌న్.

ఇక టెస్లా, ట్విట్ట‌ర్ సంస్థ‌ల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందంలో తాను గ‌నుక త‌ప్పుకుంటే 1$ బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ త‌ర‌పు లాయ‌ర్లు ఎలోన్ మ‌స్క్ కు నోటీసులు అందించారు.

అయితే తాను కోరిన వివ‌రాలు ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్లనే తాను ట్విట్ట‌ర్ డీల్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు పేర్కొన్నాడు ఎలోన్ మ‌స్క్(Elon Musk).

ఇదే స‌మ‌యంలో ట్విట్ట‌ర్ సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్(Parag Agrawal) కు బెదిరిస్తూ టెక్స్ట్ మెస్సేజ్ పెట్ట‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌స్తుతం మ‌రో వివాదానికి దారి తీసింది.

Also Read : విలువైన కాలం తిరిగి రాదు మ‌స్క

Leave A Reply

Your Email Id will not be published!