Elon Musk: ‘ఎక్స్’ను విక్రయించిన ఎలాన్ మస్క్
‘ఎక్స్’ను విక్రయించిన ఎలాన్ మస్క్
Elon Musk : టెక్ బిలియనీర్ ఎలాన్‌మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సోషల్ మీడియా దిగ్గజ ఫ్లాట్ ఫాం ‘ఎక్స్’ను విక్రయించినట్లు ఆయన ప్రకటించారు. అయితే దీనిని బయటి వ్యక్తులకు అమ్మలేదని… మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ స్టార్టప్ సంస్థ అయిన ‘ఎక్స్‌ఏఐ’ కే విక్రయించినట్లు… ఎలాన్ మస్క్ ఈమేరకు తన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతేకాదు 33 బిలియన్ డాలర్లకు ఎక్స్‌ను అమ్మివేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్‌ఏఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్‌కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని మస్క్ తన పోస్టులో పేర్కొన్నారు.
Elon Musk Sold
చాట్‌జీపీటీకి పోటీగా గతేడాది మస్క్(Elon Musk) ‘ఎక్స్‌ఏఐ’ పేరుతో స్టార్టప్ ను ప్రారంభించారు. ఇది స్థాపించినప్పటి నుంచి… xAI వేగంగా ప్రపంచంలోని ప్రముఖ AIలలో ఒకటిగా మారింది. X అనేది సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. కాగా ఇప్పడు ఈ సంస్థను ఎక్స్ఏఐ సొంతం చేసుకుంది. ఎక్స్ఏఐ, ఎక్స్ భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు. ఎక్స్ఏఐ, ఎక్స్ కలయిక ఏఐ సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడుతుంది. వినియోపగదారులకు గొప్ప అనుభవాలను అందించడానికి సంస్థ కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడే వేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా వ్యవహరిస్తున్న మస్క్… ప్రస్తుతం టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగానూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022లో ‘ట్విటర్’ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అనంతరం దాని పేరును ‘ఎక్స్’గా మార్చేశారు. ఎక్స్‌ను సొంతం చేసుకున్న తర్వాత సిబ్బందిని తొలగించడం, ద్వేషపూరిత ప్రసంగాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Also Read : Priyanka Gandhi: మలయాళం నేర్చుకుంటున్న ప్రియాంక గాంధీ