Elon Musk CEO : ట్విట్టర్ సిఇఓకు ఎలోన్ మస్క్ అల్టిమేటం
ఒప్పందం వరకు ముందుకు సాగదు
Elon Musk CEO : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ బాంబు పేల్చాడు. తాను సంతృప్తి చెందేంత వరకు ఈ డీల్ హోల్డ్ లోనే ఉంటుందన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ కు అల్టిమేటం ఇచ్చాడు.
ప్రస్తుతం మస్క్(Elon Musk CEO) చేసిన ఈ పనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో వైపు $44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు రెడీ అయినప్పటి నుంచీ నేటి దాకా సిఇఓ పరాగ్ అగర్వాల్ ను, మేనేజ్ మెంట్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు ఎలోన్ మస్క్.
ఈ మేరకు ఒప్పందంలో భాగంగా ట్విట్టర్ ఆయన లేవదీసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు సిఇఓ. అదే సమయంలో అనుమానాల్ని నివృత్తి చేసేందుకు యత్నించారు.
కానీ దేనినీ ఎలోన్ మస్క్ పరిగణలోకి తీసుకోలేదు. ప్రధానంగా సిఇఓను టార్గెట్ చేయడాన్ని మాజీ సీఇఓ, ట్విట్టర్ ఫౌండర్ అభ్యంతరం వ్యక్తం చేసినా వాటా కొనుగోలుదారుడు కావడంతో ఏమీ అనలేక పోయాడు.
మొత్తంగా ఎలోన్ మస్క్(Elon Musk CEO) ఒప్పందానికి తలవంచింది ట్విట్టర్. అయినప్పటికీ ఇది వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంది. చిక్కంతా ఏమిటంటే ఫేక్ , స్పామ్ ఖాతాలపై తనకు క్లారిటీ కావాలని ముందు నుంచీ అడుగుతూ వస్తున్నారు ఎలోన్ మస్క్.
దాంతో సంచలన ప్రకటన చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ $ 44 బిలియన్ల టేకోవర్ బిడ్ నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
5 శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలు ఉన్నాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తనకు కానీ లేదా బహిరంగంగా చూపించేంత వరకు తన ఒప్పందం ముందుకు సాగదని ప్రకటించారు ఎలోన్ మస్క్.
Also Read : ఎలోన్ మస్క్ వర్సెస్ పరాగ్ అగర్వాల్