Pranay Pathole : భారతీయ టెక్కీతో ఎలోన్ మస్క్ దోస్తీ
గత కొంత కాలం నుంచీ పెరిగిన స్నేహం
Pranay Pathole : ఆయన ప్రపంచ కుబేరులలో ఒకడిగా పేరొందారు. కానీ ప్రతి విషయాన్ని కూలంకుషంగా చర్చిస్తాడు. ప్రతి దానిని తనకు అన్వయించు కోవడంలో తనకు తనే సాటి. ఆయన ఎవరో కాదు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Mask).
ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి తరుచూ హాట్ టాపిక్ గా మారి పోయారు. ఏదో ఒక దానిపై ట్వీట్ చేయడం మళ్లీ వార్తల్లో నిలవడం మస్క్ కు అలవాటుగా మారింది.
అనివార్య కారణాల రీత్యా తాను ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదంటూ ప్రకటించాడు ఈ వ్యాపార దిగ్గజం. దానిని పక్కన పెడితే మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.
భారత దేశానికి చెందిన ఓ ఐటీ కుర్రాడితో ఎలోన్ మస్క్ కు మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ గత కొంత కాలం నుంచీ ఆన్ లైన్ లో మాట్లాడుతూ వస్తున్నారు.
తాజాగా వీరిద్దరూ కలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలోన్ మస్క్ ను కలిసిన ఆ భారతీయ టెక్కీ దిగ్గజం ఎవరో కాదు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రణయ్ పాథోల్. వీరిద్దరి ఆన్ లైన్ స్నేహం మరింత వికసిస్తూ వచ్చింది.
ఈ వారంలో చివరకు ఇద్దరూ ముఖాముఖిగా కలుసుకున్నారు. ప్రణయ్ పాథోల్(Pranay Pathole) యుఎస్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలోన్ మస్క్ ను కుబేరుడని భావిస్తారు.
ఆయనకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నా అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే డౌన్ టు ఎర్త్. ఆయన చైర్మన్ గా ఉన్నా అత్యంత వినయ పూర్వకంగా ఉండడం నన్ను విస్తు పోయేలా చేసిందన్నాడు 23 ఏళ్ల ప్రణయ్ పాథోల్.
ఎలోన్ మస్క్ ప్రతిస్పందించే సమయం తనను మరింత ఆకట్టుకుందని తెలిపాడు.
Also Read : ఎయిర్ ఏషియా నష్టం బాధ్యత టాటాదే