Elon Musk : ట్విట్ట‌ర్ కు ధీటుగా ఎలోన్ మ‌స్క్ ఫ్లాట్ ఫామ్

డొనాల్డ్ ట్రంప్ బాట‌లో ఎలోన్ మ‌స్క్

Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌స్క్ కూడా అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బాట లోనే ప‌య‌నిస్తున్నారు. ఆయ‌న సోష‌ల్ ట్రూత్ అని స్వంతంగా సోష‌ల్ మీడియాను ప్రారంభించారు.

ఇక తాజాగా ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ గా పేరొందింది ట్విట్ట‌ర్(Elon Musk). ఇప్ప‌టికే అదే టాప్ సోష‌ల్ మీడియాలో. ఇదే స‌మ‌యంలో దానిలో తెలివిగా షేర్స్ కొనుగోలు చేశాడు ఎలోన్ మ‌స్క్.

అంతే కాకుండా తాను స్వంతం చేసుకుంటానంటూ ప్ర‌క‌టించాడు. ఈ మేర‌కు $44 బిలియ‌న్ల‌కు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆపై ట్విట్ట‌ర్ ను టార్గెట్ చేశాడు.

నింద‌లు మోపాడు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. సిఇఓ భార‌తీయుడైన ప‌రాగ్ అగ‌ర్వాల్ ను ల‌క్ష్యంగా చేసుకున్నాడు. ఆపై తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

దీనిపై సీరియ‌స్ గా స్పందించింది ట్విట్ట‌ర్. త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల్సిందేనంటూ కోర్టును ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు కోర్టు నోటీసులు కూడా పంపించింది ఎలోన్ మ‌స్క్ కు.

దీంతో ట్విట్ట‌ర్ కు ధీటుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ట్విట్ట‌ర్ కు ప్ర‌త్యామ్నాయంగా తాను కొత్త ప్లాట్ ఫామ్ ను తీసుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం విశేషం. ఇందు కోసం పేరును కూడా ప్ర‌స్తావించ‌డం విశేషం. గ‌త ఏడాది అధ్య‌క్ష పీఠాన్ని వీడిన ట్రంప్ నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేశాడు.

చివ‌ర‌కు ఓడి పోయి ట్రూత్ సోష‌ల్ ను స్టార్ట్ చేశాడు. ఇంకా జ‌నాల‌కు అందుబాటు లోకి రాలేదు.

Also Read : క్ష‌మాభిక్ష‌ను పొందిన శామ్ సంగ్ బాస్

Leave A Reply

Your Email Id will not be published!