Sri Lanka Emergency : శ్రీ‌లంక‌లో ఎమ‌ర్జెన్సీ డిక్లేర్

ప్ర‌ధాని ఆఫీసును ముట్ట‌డి ప్రెసిడెంట్ ప‌రార్

Sri Lanka Emergency : శ్రీ‌లంక దేశాధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే ప్రాణ భ‌యంతో దేశం విడిచి పారి పోయాడు. ల‌క్ష‌లాది లంకేయులు ఆయ‌న‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దేశంలో సంక్షోభానికి కార‌ణం రాజ‌ప‌క్సే కుటుంబ‌మేనంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

వేలాది మంది ఇంకా ప్రెసిడెంట్ భ‌వనంలో తిష్ట వేశారు. ఇంకో వైపు ప్ర‌ధాన మంత్రి ఇంటికి నిప్పంటించి, వాహ‌నాలు త‌గుల‌బెట్టారు.

లంక‌లో ఉంటే బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌ని భావించిన గోట‌బ‌య ఆర్మీ స‌హ‌కారంతో దొడ్డి దారిన, దొంగ‌త‌నంగా మాల్దీవుల‌కు బ‌య‌లుదేరాడు త‌న భార్య‌, అంగ‌ర‌క్ష‌కుల‌తో క‌లిసి. ఈ త‌రుణంలో పీఎం ఆఫీసును ముట్టడించేందుకు రెడీ అయ్యారు లంకేయులు.

దీంతో ప‌రిస్థితులు అనుకూలించేవిగా లేక పోవ‌డంతో తాత్కాలిక అధ్య‌క్షుడిగా ఉన్న పార్ల‌మెంట్ స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అప్ర‌క‌టిత అత్య‌వ‌స‌ర పరిస్థితిని విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాజాగా మ‌రోసారి పీఎం ఇంటిని టార్గెట్ చేశారు ఆందోళ‌న‌కారులు. ఇదే స‌మ‌యంలో గోట‌బ‌య తో పాటు విక్ర‌మ సింఘే వెళ్లి పోవాలంటూ నినాదాలు చేశారు.

ఇదే స‌మ‌యంలో ర‌ణిలే కొలువు తీరిన కొలంబో కార్యాల‌యం వెలుప‌ల సాయుధ ద‌ళాలు పెద్ద ఎత్తున మోహ‌రించారు. నిర‌స‌న‌కారులు ద‌ళాల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు.

ఇప్ప‌టికే శ్రీ‌లంక(Sri Lanka Emergency) ఆర్మీ చీఫ్ దేశ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. సంయ‌మ‌నం పాటించాల‌ని శాంతికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. మ‌రో వైపు ప్ర‌ధాని కూడా రాజీనామా చేయాలని, వెంట‌నే వైదొల‌గాల‌ని డిమాండ్ చేశారు.

ఇంకో వైపు ఆర్మీ బ‌ల‌గాలు టియ‌ర్ గ్యాస్ షెల్స్ , వాట‌ర్ ఫిరంగుల‌ను ప్ర‌యోగించినా జ‌నం వినిపించు కోవ‌డం లేదు.

Also Read : గోట‌బ‌య వెళ్లేందుకు స‌పోర్ట్ చేయ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!