Emmanuel Macron : నేస్తమా ఇద్దరి లోకం ఒకటే – మాక్రాన్
ప్రధాని మోదీతో ఆలింగనం
Emmanuel Macron : ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అవి కాలంతో పాటు బల పడుతున్నాయని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ దేశం ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆయనకు ఫ్రాన్స్ పీఎం ఘన స్వాగతం పలికారు. ఇదే సమయంలో దేశ రాజధాని పారిస్ లో జరిగిన ప్రవాస భారతీయుల మీటింగ్ లో మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత దేశం ప్రపంచంలో ఇప్పుడు కీలకమైన దేశంగా మారిందన్నారు.
ఇదిలా ఉండగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాము మోదీని ఆహ్వానించామని, ఈ సందర్బంగా దేశ అత్యున్నత గౌరవ పురస్కారం అందజేశామని దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్(Emmanuel Macron) స్పష్టం చేశారు. తామిద్దరం పలు సందర్భాలలో అంతర్జాతీయ వేదికలపై కలుసుకున్నామని తెలిపారు. మా ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం దాగి ఉందన్నారు. మోదీ ఎల్లప్పుడూ ఇతర దేశాలతో సత్ సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటారని ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా తనను ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా అత్యున్నత గౌరవం దక్కేలా చేసినందుకు మాక్రాన్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రధాన మంత్రి మోదీ.
Also Read : SS Rajamouli : పర్యావరణాన్ని కాపాడుకుందాం – జక్కన్న