ENG vs SL T20 World Cup : టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ కు ఇంగ్లండ్

మెగా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా ఔట్

ENG vs SL T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా జ‌ట్టు నిష్క్ర‌మించింది. పేల‌వ‌మైన ర‌న్ రేట్ కార‌ణంగా త‌ప్పుకుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆసిస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది టైటిల్ హాట్ ఫెవ‌రేట్ గా పేరొందిన ఇంగ్లండ్. డిఫెండింగ్ ఛాంపియ‌న్ కు ఇది ఊహించ‌ని బిగ్ షాక్ .

ఇవాళ లీగ్ మ్యాచ్ లో శ్రీ‌లంక‌తో ఇంగ్లండ్ పోటీ ప‌డింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుంద‌ని అనుకున్న ఈ మ్యాచ్ ఉత్కంఠ‌ను రేపింది. ఇప్ప‌టికే న్యూజిలాండ్ సెమీస్ కు చేరింది గ్రూప్ -1 నుంచి. ఇక గ్రూప్ -బి నుంచి ఏయే జ‌ట్లు సెమీస్ కు చేరుకుంటాయ‌నేది తేలాల్సి ఉంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు ప‌టిష్ట‌మైన స్థితిలో ఉంది.

ఆ జ‌ట్టుకు పాకిస్తాన్ తో పోటీ ఉండ‌నుంది. ఇక సెమీస్ కు గ్రూప్ -బి నుంచి భార‌త్, పాకిస్తాన్ ఉండ‌గా గ్రూప్ -ఎ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్ కు దాదాపుగా చేరుకోనున్నాయి. సెమీస్ ను ఖ‌రారు చేసే కీల‌క‌మైన మ్యాచ్ శ‌నివారం జ‌రిగింది. శ్రీ‌లంక‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

నాలుగు వికెట్ల తేడాతో దెబ్బ కొట్టింది. ఒక‌వేళ ఇంగ్లండ్ పై లంక(ENG vs SL T20 World Cup) గ‌నుక గెలిచి ఉంటే ర‌న్ రేట్ ఆధారంగా ఆసిస్ చేరుకునేంది. కీవీస్, ఇంగ్లండ్, ఆసిస్ పాయింట్ల ప్ర‌కారం స‌మాన‌మే ఉన్నా ఆసిస్ కంటే ఇంగ్లండ్ మెరుగైన ర‌న్ రేట్ క‌లిగి ఉంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక 141 ర‌న్స్ చేసింది. ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి స‌త్తా చాటింది. సెమీస్ కు చేరింది.

Also Read : టీమిండియాకు ఐసీసీ స‌పోర్ట్ అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!