Assam CM : ప‌వ‌న్ ఖేరా ఎక్కుడున్నా అరెస్ట్ త‌ప్ప‌దు

అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ

Assam CM Pawan Khera Row : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై యూపీ, వార‌ణాసి, అస్సాంల‌లో బీజేపీకి చెందిన నాయ‌కులు కాంగ్రెస్ నాయ‌కుడు ప‌వ‌న్ ఖేరాపై ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం హై డ్రామా చోటు చేసుకుంది. ప‌వ‌న్ ఖేరాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన సీజేఐ ధ‌నంజ‌య చంద్ర‌చూడ్ మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేశారు.

ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు కూడా చేశారు. బాధ్య‌త క‌లిగిన ప‌ద‌వుల్లో ఉన్న వారు ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఖేరా అరెస్ట్ వ్య‌వ‌హారం(Assam CM Pawan Khera Row), ఆపై బెయిల్ త‌దిత‌ర ప‌రిణామాల‌పై సీరియ‌స్ గా స్పందించారు అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌. ప‌వ‌న్ ఖేరా ఆకాశంలో ఉన్నా లేదా భూమిపై ఉన్నా త‌మ పోలీసులు అరెస్ట్ చేయ‌క త‌ప్ప‌ద‌న్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోప‌ణ‌లు చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఎలా ప‌డితే అలా మాట్లాడితే తాము ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకు పోతుంద‌న్నారు. ఇప్ప‌టికే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఆయ‌న ఎక్క‌డున్నా ప‌ట్టుకుని తీరుతార‌ని , అరెస్ట్ త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నాగాలాండ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేసు న‌మోదు అయితే అరెస్ట్ చేసేందుకు పోలీసుల‌కు స‌ర్వ హ‌క్కులు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : మెజార్టీ ఖాయం స‌ర్కార్ త‌థ్యం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!