#Chitra : గాత్ర మాధుర్యం చిత్ర రాజసం
ఈ పద్మం బాలూ సర్ దే
Chitra : ఒకింత బాధ గా ఉంది. ఇంకొంత సంతోషంగా ఉంది. కళల పట్ల, కళాకారుల పట్ల, భాష పట్ల, తమ ప్రాంతం పట్ల ఈ దేశం తమిళనాడును చూసి నేర్చు కోవాల్సింది చాలా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక భాషలు, వేల పాటలు పాడి దేశం గర్వించదగిన స్థాయికి చేరుకున్న తెలుగు వాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఆయన దేశంలోనే భారతరత్న తర్వాత రెండో పురస్కారంగా భావించే పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.
కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఆయనను పద్మ అవార్డులకు నామినేట్ చేయలేక పోయాయి. బాలూ ఏ ఒక్కరికో చెందిన వాడు కాదు. ఆయన ఈ భారతదేశం గర్వించ దగిన ఆస్తి అన్నాడు ప్రధాని నేరంద్ర మోదీ. ఆయనపై అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన బీబీసీ ఏకంగా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం బాలూ సర్ కు పద్మ విభూషన్ అవార్డును ప్రకటించింది. మరో వైపు ఇదే తమిళనాడు సర్కార్ ప్రముఖ గాయని, ఎస్పీబీ శిష్యురాలు చిత్ర ను కూడా నామినేట్ చేసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఆమెకు పద్మ భూషణ్ ప్రకటించింది. అనుకోకుండా ఇద్దరికీ ఒకే సారి వచ్చినట్లయింది.
కానీ చిత్ర మాత్రం కన్నీటి పర్యంత మవుతోంది. తన గురువు బలూ లేడని. ఒకరు తెలుగు..ఇంకొకరు మళయాలం. పాటకు దక్కిన గౌరవం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో భాషలు మరెన్నో పాటలు. మరిచిపోని జ్ఞాపకాలు. వందలాది గీతాలు హిట్ గా నిలచాయి. పేద వాడి కంటి లో ప్రేమ రక్తము,
1985లో తన కెరీర్ స్టార్ట్ అయింది. సింధు భైరవి సినిమాలో పాడింది. అప్పటికే సుశీల, జానకమ్మలు ఉన్నారు. అయినా బాలూతో పాటే చిత్ర పాడింది. చిత్రలోని టాలెంట్ ను బాలూ గుర్తించారు. నీ అందం నా ప్రేమ గీతం గోవిందం, ఓ ప్రియా ప్రియా , ఓం నమహ పాటలు హిట్ గా నిలిచాయి. అబ్బ నీయని దెబ్బ అంటూ పాడిన సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది.
కీరవాణి చిత్రతో చాలా పాటలు పాడించారు. అహో ఒక మనసుకు నచ్చిన, రోజ్ రోజ్ రోజా పువ్వా, తెలుసా మనసా , ఇలా ప్రతి సినిమాలో తమ పెయిర్ ను కొనసాగిస్తూ వచ్చారు. రెహమాన్ సంగీతంలో వచ్చిన రోజా సూపర్ హిట్. పరువం వానగా, అంజలి అంజలి పుష్పాంజలి అనే పాట గుండెల్ని మీటింది.
అందమా అందుమా తో పాటు హలో బ్రదర్ సినిమాలో ప్రియరాగాలే గుండెలో పొంగుతున్న ఈ వేళ సాగ్ బాలూ చిత్రల కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సాంగ్ . ఏది ఏమైనా ఇద్దరూ ఇద్దరే. కానీ చిత్ర గురువు లేకుండానే పాడుతోంది. కన్నీటి పర్యంతమవుతోంది. బాలూ సర్ లేక పోతే ఆమె లేదు. ఆమె కెరీర్ అతడితో స్టార్ట్ అయింది. తమిళనాడు సర్కార్ ను అభినందించక తప్పదు. బాలూ, చిత్రల గళం అజరామరం.
No comment allowed please