Kodali Nani : అంతా స‌మానం ఒకే విధానం

అంద‌రి హీరోలు ఒక్క‌టే

Kodali Nani : ఏపీ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు . ప్ర‌భుత్వం ముందు అంతా స‌మాన‌మేన‌ని, అంద‌రి హీరోలు ఒక్క‌టేన‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఓ లెక్క మిగ‌తా వారికి ఇంకో లెక్క అంటూ ఉండ‌ద‌న్నారు.

అఖండ‌, పుష్ప‌, బంగార్రాజు రూల్సే భీమ్లా నాయ‌క్ కు వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు మాయ‌లో ప‌డి సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కించ ప‌ర్చ‌డం త‌గ‌ద‌ని హిత‌వు (Kod)ali Nani)కారు.

సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఎవ‌రి ప‌ట్లా కోపం ఉండ‌ద‌ని, అంద‌రినీ ఒకే లాగా చూస్తార‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు 50 శాతానికి పైగా ఓట్ల‌తో 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీ స్థానాల‌ను జ‌నం క‌ట్ట‌బెట్టారంటూ తెలిపారు.

ఇది త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సినిమా అన్న‌ది ఏ ఒక్క‌రి కోసమో కాద‌న్నారు. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను ఇష్టానుసారంగా పెంచి విక్ర‌యిస్తుంటే బాబు చూస్తూ కూర్చున్నాడు త‌ప్ప ప‌ట్టించు కోలేద‌ని (Kodali Nani )మండిప‌డ్డారు.

23న జివో ఇస్తామ‌ని ప‌వ‌న్ సినిమా ను రిలీజ్ చేసుకోవాల‌ని తాము చెప్ప లేద‌న్నారు. ఆయ‌న మూవీని తొక్కే్స్తున్నారంటూ చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌న్నారు.

ప‌వ‌న్ ఇప్ప‌టికే రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నారు. ఇక మిగిలింది ప్రొడ్యూస‌ర్, డిస్ట్రిబ్యూట‌ర్లే . బ్లాక్ టికెట్ల విక్ర‌యాలు ..ప్ర‌జ‌ల‌ను టూటీ చేయ‌డాన్ని తాము ఒప్పుకోమ‌న్నారు.

ఈ డ్రామా బాబును ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌న్నారు. చంద్ర‌బాబు కు అంత సీన్ లేద‌న్నారు. చంద్ర‌బాబు లాంటి తోడేళ్ల మాయ‌లో ప‌డి చిరంజీవిని త‌క్కువ చేయొద్ద‌ని సూచించారు. చంద్ర‌బాబు, నారాయ‌ణ ఓ వింత జంతువుల‌న్నారు.

Also Read : ఈ జ‌న్మ‌లో బాబు సీఎం కాలేడు

Leave A Reply

Your Email Id will not be published!