Anand Mohan Singh : మాజీ ఎంపీ ఆనంద్ సింగ్ విడుద‌ల

ఐఏఎస్ హ‌త్య కేసులో నిందితుడు

Anand Mohan Singh : బీహార్ కు చెందిన మాజీ ఎంపీ ఆనంద్ మోహ‌న్ సింగ్(Anand Mohan Singh) ఎట్ట‌కేల‌కు ఇవాళ విడుద‌ల‌య్యారు. 1994లో ఐఏఎస్ అధికారి హ‌త్య‌కు స‌హ‌క‌రించిన కేసులో 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభ‌వించారు. బీహార్ స‌ర్కార్ అత‌డి విడుద‌ల‌కు స‌హ‌క‌రించింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన రాజ‌కీయ నాయ‌కుడిని ఉద‌యం విడుద‌ల చేయాల్సి ఉంది.

కాగా మీడియాకు రాకుండా ఉండేందుకు ఒక్క‌సారిగా ప్లాన్ మార్చిన‌ట్లు స‌మాచారం. కుమారుడి పెళ్లి కోసం ఆనంద్ మోహ‌న్ సింగ్ 15 రోజుల పెరోల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. విరామ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడారు.

నితీశ్ కుమార్ స‌ర్కార్ జైలు రూల్స్ ను స‌వ‌రించింది. మాజీ ఎంపీ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వీలు కుదిరింది. కాగా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగిని హ‌త్య చేసిన కేసులో దోషిగా తేలితే ఎవ‌రైనా స‌రే శిక్ష‌లో ఉప‌శ‌మ‌నం పొందేందుకు అర్హ‌లు కారు. దీనిని బీహార్ ప్ర‌భుత్వం మార్చింది.

14 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ‌కాలం జైలు శిక్ష అనుభ‌వించిన సింగ్ తో పాటు 27 మంది దోషుల విడుద‌ల‌కు మార్గం సుగ‌మం చేసింది. మిత్ర‌ప‌క్ష‌మైన ఆర్జేడీ మ‌ద్ద‌తుతో అధికారంలో కొన‌సాగేందుకు సీఎం నితీశ్ కుమార్ చ‌ట్టాన్ని త్యాగం చేశార‌ని బీహాజీ మాజీ డిప్యూటీ సీఎం , బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ ఆరోపించారు. లోక్ స‌భ‌లో ఆర్జేడీకి ప్రాతినిధ్యం వ‌హించాడు ఆనంద్ మోహ‌న్ సింగ్(Anand Mohan Singh).

Also Read : భ‌యం అప‌జ‌యం ధైర్యం బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!