Jagadish Shettar : బీజీపీకి మాజీ సీఎం షట్టర్ గుడ్ బై
అసెంబ్లీకి..పార్టీకి రాజీనామా
Jagadish Shettar : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా కలకలం రేపింది. ఇప్పటికే పలువురు పార్టీని వీడారు. తాజాగా తనకు టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar). తనను పక్కన పెడితే కనీసం 25 సీట్లు బీజేపీ కోల్పోతోందంటూ సంచలన ప్రకటన చేశారు. తాను ఆదివారం వరకు వేచి చూస్తానని ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఉన్నట్టుండి ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
చివరి జాబితా వరకు వేచి ఉన్నారు. ఆ జాబితాలో కూడా తన పేరు లేక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కర్ణాటకలో లింగాయత్ ల సామాజిక వర్గం అధికంగా ఉంది. ఉత్తర కర్ణాటక లోని లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన కీలక మైన నాయకుడు జగదీశ్ షెట్టర్.
రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా హుబ్బళ్లి – ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరోసారి ఆయన బరిలో ఉండాలని అనుకున్నారు. కానీ బీజేపీ హై కమాండ్ ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. చివరకు టికెట్ నిరాకరించడంతో భగ్గుమన్నారు. జగదీశ్ షట్టర్(Jagadish Shettar) గుడ్ బై చెప్పడం కలకలం రేపింది. మరి ఆయన కాంగ్రెస్ వైపు చూస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : గ్యాంగ్ స్టర్ల హత్య జర్నలిస్టులకు భద్రత