Siddaramaiah Modi : మోదీకి సిద్దరామయ్య సవాల్
ప్రధానిపై మాజీ సీఎం కామెంట్స్
Siddaramaiah Modi : కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య నిప్పులు చెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా 13న ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రతిపక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా కర్ణాటక పేరు పొందిందని ధ్వజమెత్తారు. సీఎం బొమ్మై ఆధ్వర్యంలో 40 శాతం కమీషన్ ఇస్తేనే పనులు మంజూరు చేసేలా తయారు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇంకేం ఉందని అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారమంటూ నిప్పులు చెరిగారు మాజీ సీఎం సిద్దరామయ్య(Siddaramaiah Modi) .
కర్ణాటకకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు మాజీ సీఎం. గత ఏడాది భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న తన వీడియోను ఈ సందర్భంగా పంచుకున్నారు. నేను చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు సిద్దరామయ్య. అవినీతిని అంతం చేస్తానని పదే పదే చెబుతున్న పీఎం దేశంలోనే అత్యంత అవినీతికి కేంద్రం కేరాఫ్ గా మారిందని ఆరోపించారు.
కాగా కర్ణాటకలో పర్యటించిన ప్రధాన మంత్రి మోదీ మాజీ సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు నడవలేరు. కానీ ఓట్లు అడుగుతున్నారు. ఎన్నికల తర్వాత ఇక పాలిటిక్స్ నుండి నిష్క్రమిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్దరామయ్య తిరిగి మాట వెనక్కి తీసుకున్నారంటూ మండిపడ్డారు మోదీ(PM Modi). దీంతో పీఎం చేసిన కామెంట్స్ పై మాజీ సీఎం భగ్గుమన్నారు.
Also Read : ఎయిర్ ఇండియా సీఇఓకు నోటీసు