PV Ramesh : మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ పై వేటు
మేఘా గ్రూప్ నుంచి తొలగింపు
PV Ramesh : హైదరాబాద్ – మాజీ ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది మేఘా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాజమాన్యం. మంగళవారం ఈ మేరకు కీలక ప్రకలన చేసింది. ఇదిలా ఉండగా పీవీ రమేష్ సదరు కంపెనీకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
PV Ramesh Comments Viral
తాను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి పీవీ రమేష్(PV Ramesh) కు నెలకు రూ. 2 లక్షలు జీతంగా పొందుతున్నాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన లబ్దికి సదరు గ్రూప్ ఛాన్స్ ఇచ్చిందన్న ఆరోపణలు లేక పోలేదు. నిన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు పీవీ రమేష్.
తాను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిందని చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆపై జైలు ఊచలు లెక్క బెడుతున్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును వెనకేసుకు వస్తున్నట్లు మాట్లాడారు.
పీవీ రమేష్ తమపై చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఏపీ సీఐడీ. ఈ స్కీం స్కామ్ లో రూ. 371 కోట్లు చేతులు మారాయని ఆరోపించింది. ఈ మేరకు 25 పేజీల రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించింది. ఈ తరుణంలో రమేష్ పై వేటు వేయడం కలకలం రేపింది.
Also Read : NASCOM : హైదరాబాద్ అద్భుత నగరం