Gopal Rai LG : మాజీ ఎల్జీ పై విచారణ జరిపించాలి – ఆప్
మద్యం పాలసీని ఆమోదించింది ఆయనే
Gopal Rai LG : ఢిల్లీ మద్యం స్కాం వివాదం మరింత ముదిరింది. ఆప్ వర్సెస్ బీజేపీగా మారి పోయింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది సీబీఐ. కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. మద్యం పాలసీని ప్రభుత్వం తయారు చేస్తే ఆమోదించింది, సంతకం చేసింది మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అని ఆరోపించింది.
ఢిల్లీ ప్రభుత్వంలో పర్యావరణం, సాధారణ పరిపాలన శాఖను కలిగి ఉన్నారు గోపాల్ రాయ్(Gopal Rai). ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయనపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గోపాల్ రాయ్. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించి సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆప్ నాయకులు , కార్మికులు వివిధ రాష్ట్రాలలో నిరసనలు చేపట్టారు. సీబీఐ చర్య కేవలం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని ట్రాప్ చేసేందుకు కుట్ర పన్నిందంటూ గోపాల్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్సైజ్ పాలసీ పత్రాలపై తుది ముద్ర వేసింది ఎల్జీనేని కాబట్టి ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా ఉంటే ఎల్జీని కూడా ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. ఇందులో కుట్ర జరిగిందన్నది తేలి పోయిందన్నారు గోపాల్ రాయ్(Gopal Rai LG). వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మోదీ సర్కార్ పై మండిపడ్డారు ఆప్ నేత.
Also Read : అరెస్ట్ పై సుప్రీంకు సిసోడియా