Ponnaiyan Annamalai : బీజేపీతో బంధం అన్నాడీఎంకేకు నష్టం
మాజీ మంత్రి పొన్నియన్ షాకింగ్ కామెంట్స్
Ponnaiyan Annamalai : తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య రోజు రోజుకు దూరం పెరుగుతోంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. పాలిటిక్స్ ను మరింత వేడెక్కిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో అన్నాడీఎంకే శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడి పోయారు.
తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నియన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటూ పేర్కొన్నారు. నమ్మక ద్రోహానికి పెట్టింది పేరంటూ సంచలన ఆరోపణలు చేశారు. మిత్రపక్ష ప్రభుత్వాలను కూల్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తమను డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదని, తమ పార్టీని ఎలా నడుపుకోవాలో తమకు బాగా తెలుసని అన్నారు. గీత దాటొద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు పొన్నియన్ బీజేపీ రాష్ట్ర చీఫ్ కె. అన్నామలైని(Ponnaiyan Annamalai). పార్టీలను పడగొట్టే సంస్కృతి బీజేపీకి అలవాటుగా మారిందని అందుకనే ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలంటూ తీవ్రంగా హెచ్చరించారు పొన్నియన్.
పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం తగదంటూ మరో అన్నాడీఎంకే నాయకుడు రామచంద్రన్ సైతం వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం మాజీ మంత్రితో పాటు సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య దూరం పెరిగేలా చేసింది.
ఇదిలా ఉండగా అన్నాడీఎంకేలో మాజీ సీఎంలు పళనిస్వామి ,పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కే అన్నామలై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో రెండు వర్గాలు కలిసి పోవాలని సూచించడంపై పొన్నియన్ మండిపడ్డారు.
Also Read : తమిళనాడును ముంచెత్తిన వర్షం