Ex Minister Girija Vyas: హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ మృతి
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ మృతి
Girija Vyas : మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్(Congress) నాయకులు గిరిజా వ్యాస్ (79) ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా ఉదయపూర్, అహ్మదాబాద్ ఆసుపత్రుల్లో గిరిజా వ్యాస్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె… గురువారం సాయంత్రం కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం ఉదయపుర్‌లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. గిరిజా వ్యాస్ కాంగ్రెస్‌లో ప్రముఖ నేతగా వెలుగొందారు. కేంద్రం, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు. పీసీసీ అధ్యక్షురాలిగానూ సేవలందించారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గానూ పని చేశారు.
రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ అనంతరం హారతి ఇచ్చే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్(Girija Vyas) కు మంటలు అంటుకున్నాయి. దీనితో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు… మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Girija Vyas – గిరిజా వ్యాస్ రాజకీయ ప్రస్థానం
1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు
1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
1996, 1999లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి,2009లో చిత్తోరగఘ్ నుండి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారు
కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్‌గా సేవలందించారు.
Also Read : Air India: పాక్ గగనతలంపై ఆంక్షలతో ఎయిరిండియాకు భారీ నష్టం