P Chandrasekhar : బీజేపీకి గుడ్ బై బీఆర్ఎస్ కు జై

గులాబీ గూటికి మాజీ మంత్రి

P Chandrasekhar : హైద‌రాబాద్ – ఉమ్మ‌డి ఏపీలో కీల‌క‌మైన బీసీ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబ‌ర్ పొడ‌పాటి చంద్ర‌శేఖ‌ర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయ‌న గులాబీ పార్టీలో చేరారు. అంత‌కు ముందు ఆయ‌న మంత్రి కేటీఆర్ ను క‌లుసుకున్నారు. పొడ‌పాటి చంద్ర‌శేఖ‌ర్ బ‌ల‌మైన నేత‌గా పేరొందారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.

P Chandrasekhar Joined in BRS Party

లాయ‌ర్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయ‌న గ‌తంలో కీల‌క‌మైన ప‌ద‌వులు నిర్వ‌హించారు. రోడ్డు ర‌వాణా సంస్థ , న్యాయ శాఖ మంత్రిగా పద‌వులు చేప‌ట్టారు. తెలుగుదేశం పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ఆయన సోద‌రుడే దివంగ‌త ఎమ్మెల్యే ఎర్ర‌స‌త్యం.

మ‌రో సోద‌రుడు ఎర్ర‌శేఖ‌ర్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయ‌న కూడా సీఎం కేసీఆర్ ను క‌లిసి పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల‌కు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో పొడ‌పాటి చంద్ర‌శేఖ‌ర్ తో పాటు ఎర్ర‌శేఖ‌ర్ చేరికతో బీఆర్ఎస్(BRS) కు అద‌న‌పు బ‌లం స‌మ‌కూరిన‌ట్ల‌యింది. మొత్తంగా ఉమ్మ‌డి పాలమూరు జిల్లా రాజ‌కీయాలు , స‌మీక‌ర‌ణ‌లు పూర్తిగా మార‌నున్నాయి.

Also Read : Dharmapuri Aravind : ధ‌ర్మ‌పురి అర‌వింద్ షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!