Gone Prakash : ప్రధాని మోదీకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే ‘గోనె ప్రకాష్’
జగన్ తన పేరు లేదని అనుకుంటున్నారని.. ఏమీ కాదు అనుకుంటున్నారని....
Gone Prakash : గౌతమ్ అదానీ అవినీతితో పాటు, గతంలో ఏపీ సీఎంగా జగన్(YS Jagan) ఉన్నప్పుడు రాష్ట్రంతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అక్రమాలపై రిటైర్డ్ సుప్రింకోర్టు జడ్జి, లేదా సీబీఐ,జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు.ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గోనె ప్రకాష్(Gone Prakash) బహిరంగ లేఖ రాశారు. గౌతమ్ అదానీ అవినీతిపై ప్రపంచవ్యాప్తంగా సంచలన రేపుతోందన్నారు. ప్రస్తుత దశలో గతంలో అదానీ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.అక్రమలపై దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ అక్రమ డీల్‌తో 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పడే భారం 1.50 లక్షల కోట్లు అని తెలిపారు. వెంటనే విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Gone Prakash Write Letter to..
జగన్ తన పేరు లేదని అనుకుంటున్నారని.. ఏమీ కాదు అనుకుంటున్నారని.. జగన్ సిద్ధార్థ లూత్రాను, కపిల్ సిబల్‌ను ఎవరిని పెట్టుకున్న శిక్ష తప్పదని హెచ్చరించారు. ఒక్క డాలర్ వచ్చిన శిక్ష తప్పదని.. అలాంటిది 1,750 కోట్లు వచ్చాయన్నారు. అమెరికా కోర్టుకు జగన్ హాజరుకాక తప్పదన్నారు. చట్టాలకు ఎవరు కూడా అతీతులు కాదని..సీబీఐని అడ్డుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి దన్నారు. నిందితుడుగా ఉన్న ఒకరిని జగన్ రక్షించారని ఆరోపించారు. జగన్ కచ్చితంగా అమెరికా వెళ్లాల్సిందే అని, కోర్టుకు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేశారు.‘‘నా పేరు లేదని జగన్ చెప్పినా ఉపయోగం లేదు. చేసిన తప్పును ఒప్పుకోవాల్సిందే ’’ అని అన్నారు.
రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లు వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. అదానీ పేరు మీద గంగవరం పోర్టు ఇతర సంస్థలు ఉన్నాయని.. వాటిని వెంటనే ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గతంలో మోడీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అమెరికా వీసా కూడా ఇవ్వలేదన్నారు. మళ్ళీ ప్రధానమంత్రి ఆయన తర్వాత మోడీకి అమెరికా వీసా వచ్చిందని గుర్తుచేశారు. అమెరికా చట్టాలు కఠినంగా ఉంటాయని..శిక్షపడక తప్పదన్నారు. అదానితో సహా అందరూ అమెరికా కోర్టు ముందు హాజరుకావాల్సిందే అని అన్నారు. అదానికి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఒప్పందం ద్వారా స్వయంగా అప్పటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి రూ.1,750 కోట్లు నేరుగా లంచాలు ముట్టినట్టు అమెరికా అభియోగాలు మోపబడ్డాయని తెలిపారు. ‘‘మన దేశం పరువు ప్రపంచం ముంగిట అదాని తీస్తే , జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీశారు. జీవీకేను టార్చర్ చేసి ముంబై ఎయిర్పోర్టును అదానికి కట్టబెట్టారు’’ అంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలు చేశారు.
Also Read : America News : అమెరికా వీధుల్లో పలువురు పాకిస్థానీయుల నిరసనలు