Ex MP Harsha Kumar : షర్మిల పదవీ బాధ్యతలపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైరల్ అవుతున్న మాజీ ఎంపీ హర్ష కుమార్ వ్యాఖ్యలు

Ex MP Harsha Kumar : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ నేప‌థ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం రాష్ట్రానికి కీర్తిప్ర‌తిష్ఠ‌లు తీసుకురావ‌డానికి మ‌రింత దూకుడు పెంచుతోంది. రాష్ట్రాన్ని విభజించిన పుణ్యమా అని 2014 నుంచి 2019 వరకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2024 ఎన్నికల్లో అధికారాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. క‌ర్ణాట‌క, తెలంగాణ ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ మ‌రింత క‌ష్ట‌ప‌డుతోంది. ఏది ఏమైనా, ఏపీలో కూడా గెలుపు సాధించాలని చూస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికను రూపొందించారు.

Ex MP Harsha Kumar Comments Viral

ఈ క్రమంలో ఇప్పటికే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిలని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీ నేతల్లో కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్ష్ కుమార్(Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హర్షకుమార్ హైకమాండ్‌ను కోరారు. పీసీసీ చీఫ్ గా షర్మిలకు అప్పగిస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు. వైఎస్ షర్మిలకు జాతీయ స్థాయిలో కావాలంటే ఇవ్వండి అంటూ హర్షకుమార్ ఉచిత సలహా ఇచ్చారు.

తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకొని తిరిగిన షర్మిల ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ప్రచారం చేస్తారని హర్ష్ కుమార్ ప్రశ్నించారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల ఒక్కటేనని పేర్కొన్నారు. మ్యారేజ్ కార్డ్ ఇవ్వడానికి అరగంట మాట్లాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. ప్రధాని మోదీకి వెనక వైఎస్ జగన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వెనక వైఎస్ షర్మిల తిరుగుతున్నారు. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తాము క్షేమంగా ఉండాలన్నదే జగన్, షర్మిలల ఉద్దేశమని హర్ష కుమార్ అన్నారు.

Also Read : Telangana Elections : జనవరి 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్

Leave A Reply

Your Email Id will not be published!