Kanguva Movie : క్రియేటివిటీకి పెట్టింది పేరు తమిళ సినిమా. ఇక మినిమం గ్యారెంటీ ఉన్న నటుడిగా గుర్తింపు పొందాడు సూర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం కంగువ. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని సినీ పండితులు పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ కూడా చేర్చారు దర్శకుడు. ట్రాన్స్ ..మ్యాన్ విత్ ది పవర్ ఆఫ్ పైర్స్ అని పెట్టాడు. తమిళ భాషా కాలపు యాక్షన్ , డ్రామా చలన చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. శివ దర్శకత్వం వహించారు. దీనికి కథ ఆది నారాయణ రాశారు.
Kanguva Movie Hopes
స్టూడియో గ్రీన్ , యువీ క్రియేషన్స్ బ్యానర్ లపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా , వి. వంశీ కృష్నా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు కంగువను(Kanguva). ఈ మూవీలో సూర్య ఐదు పాత్రల్లో నటించారు. ఇందులో బాలీవుడ్ కు చెందిన నటి దిశా పటానితో పాటు యోగి బాబు, కోవై సరళ, ఆనంద్ రాజ్ , రవి రాఘవేంద్ర , కేఎస్ రవి కుమార్. బీఎస్ అవినాష్ లు ఇతర పాత్రల్లో నటించారు.
2019లో సూర్య 39న పేరుతో మూవీ మేకర్స్ ప్రకటించారు. జనవరి 2021లో ప్రీ ప్రొడక్షన్ ను ప్రారంభించారు. సూర్య సూరారై పొట్రును ముగించాక దీనిని స్టార్ట్ చేశారు. శివ దర్శకత్వం వహించిన అన్నాత్తే ఆలస్యం అయింది. గోవా, కేరళ, కొడైకెనాల్ లోని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు కంగువాను. రూ. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదోది కావడం విశేషం.
Also Read : Justice Vijay Sen Reddy : ఫ్యాక్ట్ చెక్ పట్ల అవగాహన అవసరం