Extra Marital Affairs: నలుగురు పిల్లలు, భర్తను కాదని ప్రియుడితో మహిళ జంప్ !

నలుగురు పిల్లలు, భర్తను కాదని ప్రియుడితో మహిళ జంప్ !

Extra Marital Affairs : వివాహేతర సంబంధాలు… పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినవారు కొందరైతే… ప్రియురాలి మోజులో భార్యాపిల్లలను గాలికి వదిలేసిన వారు కొందరుంటున్నారు. అయితే తాజాగా ప్రియుడికోసం నలుగురు పిల్లలను, భర్తను వదిలేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Extra Marital Affairs Issue in Warangal

వరంగల్ జిల్లా షోడాషపల్లి శివారు పిట్టలగూడెంకు చెందిన కాలియ శంకర్‌ కు… చంద్రమ్మ అనే మహిలతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యాతండా గ్రామ పంచాయతీ శివారు వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో చంద్రమ్మకు వివాహేతర సంబంధం (Extra Marital Affairs) ఏర్పడింది. దీనితో మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు కలిసి పారిపోగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిని పట్టుకొచ్చారు. అనంతరం ఇరు కుటుంబాలు పెద్దలు పంచాయితీలో మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పారు. దీనితో కులపెద్దలు చంద్రమ్మను తన తల్లిగారి గ్రామమైన చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు పంపించారు.

అయితే మళ్లీ చంద్రమ్మకు రాజు మాయమాటలు చెప్పి మళ్ళీ తన వెంట తీసుకువెళ్లాడు. వారంక్రితం రాజు, చంద్రమ్మ వేపలగడ్డ తండాకు వచ్చారనే విషయం తెలుసుకున్న భర్త శంకర్‌ కుటుంబ సభ్యులు తండాకు వెళ్లి రాజును, చంద్రమ్మను చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గొడవ జరుగకుండా నిలువరించారు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అనంతరం చంద్రమ్మ… నలుగురు పిల్లలు, భర్తను వద్దని… ప్రియుడే కావాలని పంచాయితీ పెద్దలకు చెప్పింది. ప్రియుడు రాజుతోనే ఉంటానని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పి అతడితోనే వెళ్లిపోయింది. దీనితో తనకు తన భార్య కావాలని, తల్లి కోసం పిల్లలు ఏడుస్తున్నారని భార్యను తనకు అప్పగించాలని భర్త శంకర్‌ పోలీసులను వేడుకుంటున్నాడు.

Also Read : Congress: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ ! పన్ను మినహాయింపునకు ట్రిబ్యునల్ నిరాకరణ !

Leave A Reply

Your Email Id will not be published!