Face Book Top : సోషల్ మీడియాలో ఫేస్ బుక్ టాప్
2022లో మొత్తం 462 కోట్ల మంది
Face Book Top : టెక్నాలజీ మారింది. సోషల్ మీడియా వినియోగం పెరిగింది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది భారీగా.
ఒకటా రెండా ఏకంగా 462 కోట్ల మంది వినియోగదారులు చేరడం వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలియ చేస్తుంది. 2021లో 420 కోట్ల మది ఉంటే కేవలం ఈ ఏడాది 2022లో ఆ సంఖ్య మరింత పెరిగింది.
ఏకంగా 462 కోట్లకు చేరింది. ఇది ఊహించని పరిణామం. రాను రాను మరికొన్ని సంస్థలు కూడా కొత్తవి రావచ్చు. కానీ గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాను ఫేస్ బుక్ శాసిస్తోంది.
అదే టాప్ గా నిలిచింది. ఫేస్ బుక్ ను(Face Book Top) మేటా గా కొత్తగా మార్పు చేసినా జనం దానిని వీడడం లేదు. మరో వైపు సెర్చింగ్ ఇంజన్ గూగుల్ దుమ్ము రేపుతోంది.
యూట్యూబ్ సైతం దూసుకు పోతోంది. ప్రత్యామ్నాయంగా ఎన్ని కొత్తగా వస్తూనే ఉన్నా టెక్నాలజీ పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఆమోద యోగ్యంగా ఉండడంతో ఫేస్ బుక్ దూసుకు పోతోంది.
ఇక మొత్తం వరల్డ్ వైడ్ గా ఉన్న జనాభాలో సామాజిక మాధ్యమాలను వాడుతున్న వారి సంఖ్య 54 శాతంగా ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని తాజాగా గ్లోబల్ సోషల్ మీడియా స్టాటిస్టిక్స్ రీసెర్చ్ తన వార్షిక నివేదిక 2022లో వెల్లడించింది.
ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ , ఇంటర్నెట్, సోషల్ మీడియా అన్నది భాగంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా 62.5 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తుండడం విశేషం.
ఇక సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య 265.2 కోట్ల మంది వాడుతున్నారు. 200 కోట్ల మంది వాట్సాప్ వినియోగిస్తున్నారు.
Also Read : సామాజిక మాధ్యమాలపై కేంద్రం ఫోకస్