Nirmala Sitharaman : స‌మిష్టిగా స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి

పిలుపునిచ్చిన నిర్మ‌లా సీతారామ‌న్

Nirmala Sitharaman : ప్ర‌పంచం క‌రోనా కంటే ముందు క‌రోనా త‌ర్వాతగా మారి పోయిందని ఈ త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారినే కాదు ఇత‌ర స‌వాళ్ల‌ను అన్ని దేశాలు స‌మిష్టిగా పోరాడాల‌ని పిలుపునిచ్చారు దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.

ఇప్ప‌టి దాకా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంలో ఒక్కో దేశం ఒక్కోలాగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ పేర్కొన్నారు. క‌రోనాపై పోరాటంలో భార‌త ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానం బాగుంద‌న్నారు.

దీని వ‌ల్ల కోట్లాది మందికి వ్యాక్సిన్ల‌ను చేర వేయ‌గ‌లిగామ‌ని తెలిపారు. క‌రోనా కార‌ణంగా దేశ  ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌న్నారు. దీనిని నివారించేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించాల‌ని సూచించారు.

ఇండోనేషియా నేతృత్వంలో జ‌రిగిన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్ర‌ల్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ల మొద‌టి వ‌ర్చువ‌ల్ ప్యానల్ స‌మావేశం జ‌రిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman) ప్ర‌సంగించారు.

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనే విష‌యంలో ఒక్కో దేశం ఒక్కో తీరున వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని అన్ని దేశాలు ఒకే విధానాన్ని అమ‌లు చేస్తే బెట‌ర్ అన్నారు.

ఆ దిశ‌గా ఉమ్మ‌డి కార్యాచార‌ణ అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు నిర్మ‌లా సీతారామ‌న్. భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే ఇబ్బందులు, స‌వాళ్ల‌ను ఎదుర్కొనే స్థాయికి అన్ని దేశాలు చేరుకోవాల‌ని పిలుపునిచ్చారు విత్త మంత్రి.

దిగువ‌, మ‌ధ్య ఆదాయ దేశాల‌కు బ‌హుళ‌జాతి సంస్థ‌లు నిధులు అందించి ఆదుకోవాల‌ని కోరారు. ప్ర‌ధానంగా భార‌త దేశం ఆరోగ్యానికి ఎక్కువ ప్ర‌యారిటీ ఇచ్చింద‌ని. ఈ ఒక్క రంగానికే 29 బిలియ‌న్ డాల‌ర్ల‌ను కేటాయించింద‌న్నారు నిర్మ‌లా.

Also Read : ధ‌న్ క‌ర్ కు ఊర‌ట పిటిష‌న్ కొట్టివేత

Leave A Reply

Your Email Id will not be published!