Fake Baba: దొంగ బాబా గుట్టు రట్టు చేసిన మెదక్ పోలీసులు

దొంగ బాబా గుట్టు రట్టు చేసిన మెదక్ పోలీసులు

Fake Baba : మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ఆ దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy) వెల్లడించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Fake Baba Viral

వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి.. అనే వ్యక్తి బాబా అవతారం ఎత్తి… సమస్యలను పరిష్కరిస్తానంటూ… ఆరోగ్యం బాగలేకపోతే నయం చేస్తానని నమ్మించి ఆడవాళ్లను మోసం చేస్తున్నాడు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తాను పూజలు చేసి నయం చేస్తానని నమ్మించి… ప్రత్యేక పూజల పేరుతో మహిళలకు మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఈ ఫేక్‌ బాబా తన పూజల సమయంలో నిమ్మకాయలలో నిద్రమాత్రలు కలిపి మహిళలకు వాసన చూపించి, వాటిని తాగించేవాడు… స్పృహ కోల్పోయిన తర్వాత వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి, బాధితులను బ్లాక్‌ మెయిల్‌ చేసేవాడు. నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో వందలాది మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌ కు తరలించారు.

బాపు స్వామి చేతిలో మోసపోయిన పలువురు మహిళలు… మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మెదక్ పోలీసులు బాపుస్వామిని అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy) తెలిపారు. నిందితుడి నుంచి తాయత్తులు, మత్తుమందు, రెండు సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద దొరికిన ఫోన్లలో మహిళలతో ఉన్న వీడియోలు, ఫొటోలు లభించాలని సంచలన విషయాలు తెలిపారు. వాటితోనే మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగ బాబాలను నమ్మెుద్దని, మీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మంత్రాలకు చింతకాయలు రాలవని.. కుటుంబసభ్యులు, బంధువులతో చర్చించి ఆర్థిక, ఆరోగ్య, ఇతర సమస్యలు తీర్చుకోవాలని సూచించారు.

Also Read : High Court: హైకోర్టులో బండి సంజయ్‌, హరీష్‌రావులకు బిగ్ రిలీఫ్

Leave A Reply

Your Email Id will not be published!