Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) నిప్పులు చెరిగారు. గురువారం గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్ తో పాటు అతడి అనుచరుడు గులామ్ ను ఝాన్సీ వద్ద యూపీ స్పెషల్ టీం ఎన్ కౌంటర్ లో కాల్చి పారేసింది. దీనిపై లాయర్ ఉమేష్ పాల్ తల్లి శాంతి దేవి సంచలన కామెంట్స్ చేశారు. ఇది తన కొడుకుకు దక్కిన నివాళి అని, సీఎం యోగికి ధన్యవాదాలు తెలిపింది.
ఈ ఎన్ కౌంటర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు అఖిలేష్ యాదవ్. ఇది పూర్తిగా ఫేక్ ఎన్ కౌంటర్ గా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి కోర్టులపై నమ్మకం లేదని ఆరోపించారు. చట్టాని చేతుల్లోకి తీసుకుంటోందని మండిపడ్డారు ఎస్పీ చీఫ్.
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అధికార పార్టీ యత్నిస్తోందన్నారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). అధికారంలో ఉన్న వారు ఎవరిది ఒప్పు తప్పు అని తీర్పు చెప్పడం సరి కాదన్నారు. బీజేపీ సామరస్యానికి వ్యతిరేకమన్నారు.
ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసద్ , గులాం మోటార్ సైకిల్ పై పారి పోయేందుకు ప్రయత్నించారు. ఝాన్సీలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ వారిని అడ్డగించింది. వారు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ప్రతీకార కాల్పుల్లో మరణించారని తెలిపారు. వారి నుంచి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Also Read : అసద్ హత్య నా కొడుకుకు నివాళి