Forbes Richest List : ఫోర్బ్స్ లిస్టులో ఫల్గుణి..సావిత్రి జిందాల్
100 మంది మహిళా ధనవంతులు వీరే
Forbes Richest List : ఫోర్బ్స్ 100 మంది ధనవంతుల భారతీయ మహిళల జాబితా విడుదల చేసింది. వారిలో నైకా సంస్థ చీఫ్ ఫల్గుని నాయర్ తో పాటు సావిత్రి జిందాల్ టాప్ లో ఉండడం విశేషం.
మరోసారి సావిత్రి జిందాల్ టాప్ లో నిలిచారు. ఆమె సంపద 16.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో జిందాల్ అగ్ర స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్ పర్సన్ గా ఉన్నారు సావిత్రి జిందాల్. వంద మంది జాబితాలో ఏకంగా టాప్ లో ఉండడం విశేసం. ఏకైక మహిళా బిలియనీర్ కావడం విశేషం.
సావిత్రి జిందాల్ నికర విలువ రూ. 1,32,452.97 కోట్లు. వినోద్ రాయ్ గుప్తా తన కొడుకుతో కలిసి హావెల్స్ ఇండియాను నడుపుతున్నారు. వారి నికర విలువ రూ. 50,881.32 కోట్లు. రేఖా జున్ జున్ వాలా ఫోర్ట్ ఫోలియోలో అలైడ్ ఇన్సూరెన్స్ , స్టార్ హెల్త్ , టైటాన్ వంటి బ్రాండ్ లు ఉన్నాయి.
ఆమె నికర విలువ రూ. 47,650.76 కోట్లు. నైకా ఫౌండర్ గా ఉన్న ఫల్గుణి నాయర్ ఈ ఏడాది రూ. 32,951.71 కోట్ల నికర విలువతో ఫోర్బ్స్ జాబితాలోకి అడుగు పెట్టారు.
లీలా తివారీ యుఎస్వీ ఇండియా చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమె నికర విలువ రూ. 30,205.74 కోట్లు. బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ నికర విలువ రూ. 21,806.28 కోట్లు. అను అగా మళ్లీ ఫోర్బ్స్(Forbes Richest List) జాబితాలోకి వచ్చారు.
ఆమె నికర విలువ రూ. 18,010.37 కోట్లుగా ఉంది. మొత్తంగా భారతీయ మహిళలు మరోసారి తమకు ఎదురే లేదని చాటారు. తాము ఏ రంగం లోనైనా రాణిస్తామని చెప్పకనే చెప్పారు.
Also Read : లెస్బియన్లు ఒక్కటయ్యారు