Dinesh Chandimal : చండీమాల్ ఆట తీరుకు స‌ర్వ‌త్రా ఫిదా

ఆస్ట్రేలియాకు చుక్క‌లు చూపించిన క్రికెట‌ర్

Dinesh Chandimal : ఓ వైపు దేశం అట్టుడుకుతోంది. ఆర్థిక‌, ఆహార‌, ఆయిల్, గ్యాస్, విద్యుత్ సంక్షోభంతో నానా తంటాలు ప‌డుతోంది. రాజ‌కీయ అనిశ్చితి ఏర్ప‌డింది. జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చారు.

ప్ర‌జ‌ల ఆగ్రహం త‌ట్టుకోలేక ఆ దేశ అధ్య‌క్షుడు గోట‌బోయ రాజ‌ప‌క్సే రాజ భ‌వ‌నం విడిచి పారి పోయాడు. ఇక ప్ర‌ధాన మంత్రి ఇప్ప‌టికే ఆర్మీ క్యాంపులో బిక్కు బిక్కుమంటూ త‌ల‌దాచుకున్నాడు.

మాజీ క్రికెట‌ర్ స‌న‌త్ జ‌య‌సూర్య అయితే ఏకంగా ఆందోళ‌న‌కారుల్లో చేరి పోయాడు. త‌న దేశపు జెండాను ప‌ట్టుకుని నినాదాలు చేశాడు. రాజ సౌధం కూలి పోయింది. క‌ల‌లు క‌ల్ల‌లు అయ్యాయి.

రాచ‌రికం ఎంత కాలం న‌డ‌వ‌దు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లంటూ పేర్కొన్నాడు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మ‌రికొంత మంది మాజీ క్రికెట‌ర్లు నిలిచారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆస్ట్రేలియా శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించింది.

ఆ జ‌ట్టు రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ ఆడింది. మొద‌టి టెస్టు మ్యాచ్ లో ఆసిస్ విజ‌యం సాధించింది. కానీ గాలే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో శ్రీ‌లంక చుక్క‌లు చూపించింది. జ‌య కేత‌నం ఎగుర వేసింది.

ప్ర‌ధానంగా దినేశ్ చండీమాల్(Dinesh Chandimal)  షాన్ దార్ డ‌బుల్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. అత్యంత క‌ళాత్మ‌క‌మైన‌, క‌ళ్లు చెదిరే షాట్స్ ఆడాడు. ఏకంగా 206 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు.

త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. మ‌రో భార‌త జ‌ట్టు ఆటగాడు సూర్య కుమార్ యాద‌వ్ కూడా ఇంగ్లండ్ కు చుక్క‌లు చూపించాడు. సెంచ‌రీతో స‌త్తా చాటాడు.

ఇద్ద‌రూ వేర్వేరు ఫార్మాట్ ల‌లో రాణించ‌డం విశేషం. చండీమాల్(Dinesh Chandimal)  అసాధార‌ణ ఆట తీరుపై తాజా, మాజీ క్రికెట‌ర్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Also Read : ఐపీఎల్ అయితే రెస్ట్ తీసుకుంటారా – స‌న్నీ

Leave A Reply

Your Email Id will not be published!